Horoscope Today: గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుది. దీంతో ఆయా రాశులు గల జీవితాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై గురువారం పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువ. ఈ నేపథ్యంలో 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే కిందకి వెళ్లండి..
మేష రాశి:
ఈ రాశి వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను చేరడంతో ప్రశంసలు అందుతాయి. కుటంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
వివాహ ప్రతిపాదన విషయంలో సీరియస్ గా ఉంటారు. దీంతో ఇంట్లో వాళ్ల మద్దతు ఉంటుంది. ఇంటి సౌకర్యాల కోసం ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామి అండతో కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి:
అత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడుతుంది. కానీ కొందరు ధన సాయం చేయడానికి ముందుకు రారు. విద్యార్థులు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధిస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి.
కర్కాటక రాశి:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. భాగస్వాముల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాలి. సోదరుడి సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
సింహారాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తారు.
కన్య రాశి:
పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
తుల రాశి:
ఈ రాశి వారు విద్యారంగానికి చెందిన వారైతే లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. పాత స్నేహితులను కలుస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గాలు ఏర్పడుతాయి.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి పురోగతి ఉంటుంది.
ధనస్సు రాశి:
కొన్ని పనులు పూర్తి చేయడంలో ఉద్యోగులు శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వామితో కలిసి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కొందరు మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తారు.
మకర రాశి:
పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ధన సాయం కోసం ఇతరులను సంప్రదిస్తారు. సాయంత్రం విహార యాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. ఎవరిదగ్గరనైనా అప్పు అడగాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగుల సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి.
మీనరాశి:
జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొత్తగా ఉద్యోగం చేరినట్లయితే సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.