https://oktelugu.com/

Gangavva: బిగ్ బ్రేకింగ్ : ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ గంగవ్వపై పోలీస్ కేసు నమోదు..కారణం ఏంటో తెలుసా?

1972 షెడ్యూల్ IV చట్టం క్రింద ఇది నేరం లెక్కలోకి వస్తుంది. అందుకే గౌతమ్ ఫారెస్ట్ అధికారులకు ఆధారాలతో సహా అప్పగించి కేసు నమోదు చేసారు. గత కొద్దిరోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుకి సంబంధించిన నిందితుడు రాజు ని పోలీసులు ఈమధ్యనే అరెస్ట్ చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 08:12 AM IST

    Gangavva(2)

    Follow us on

    Gangavva: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగవ్వ ఇప్పుడు లీగల్ గా చిక్కుల్లో పడింది. ఈమె ఒక ప్రముఖ యూట్యూబర్ గా సోషల్ మీడియా ఆడియన్స్ కి బాగా సుపరిచితం అనే విషయం తెలిసిందే. ఆ ఫేమ్ తోనే ఈమెకు బిగ్ బాస్ రియాలిటీ షో లో రెండు సార్లు పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే ఈమె తన వీడియోల పేరిట వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నియమాలను ఉల్లగించారంటూ ఎనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త అదులాపురం గౌతమ్ గంగవ్వ మరియు ఆమెతో వీడియోలు చేసే రాజుపై కేసు నమోదు చేసాడు. వినోదం పేరుతో ఒక చిలుకని పంజరంలో బంధించి వీడియోలు చేసారని, ఇది చట్టరీత్యా నేరం అని గౌతమ్ ఫిర్యాదు చేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, 2022 వ సంవత్సరం లో మై విలేజ్ షో లో భాగంగా గంగవ్వ, రాజు ఒక స్కిట్ చేసారు. ఈ స్కిట్ లో వీళ్లిద్దరు చిలక జోశ్యం చెప్పే వాళ్ళుగా కనిపిస్తారు. పంజరంలో బంధించి ఒక చిలకని కూడా తీసుకొస్తారు.

    1972 షెడ్యూల్ IV చట్టం క్రింద ఇది నేరం లెక్కలోకి వస్తుంది. అందుకే గౌతమ్ ఫారెస్ట్ అధికారులకు ఆధారాలతో సహా అప్పగించి కేసు నమోదు చేసారు. గత కొద్దిరోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుకి సంబంధించిన నిందితుడు రాజు ని పోలీసులు ఈమధ్యనే అరెస్ట్ చేసారు. గంగవ్వ ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తే, ఈ వీకెండ్ మనం మరో సెల్ఫ్ ఎలిమినేషన్ ని చూడొచ్చు. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని బయటకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నామినేషన్స్ లో ఉన్నటువంటి డేంజర్ జోన్ కంటెస్టెంట్ దాదాపుగా సేఫ్ అయ్యినట్టే అనుకోవాలి. మరి ఏమి జరగబోతుందో చూడాలి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ని శుక్రవారమే చేసే అవకాశం ఉంది.

    ఎందుకంటే శనివారం రోజు దీపావళి ఎపిసోడ్ ని గ్రాండ్ గా షూట్ చేయబోతున్నారు. అంటే మనకి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది శుక్రవారమే తెలిసిపోతుంది. మరి గంగవ్వ తనకి తానూ సెల్ఫ్ నామినేట్ చేసుకొని వెళ్తుందా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత హౌస్ లోని వాతావరణం కి తట్టుకోలేక సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో మళ్ళీ ఆమె వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఆమెను ఎంచుకోవడం బిగ్ బాస్ టీం చేసిన పెద్ద తప్పిదం, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ గంగవ్వ మాత్రం తన శక్తికి తగ్గట్టు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదో, అంత ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. నిన్న రాత్రి ఆమె దెయ్యం పట్టినదానిలాగా ఎలా అరిచి హౌస్ మేట్స్ అందరినీ హడలు కొట్టిందో మనమంతా చూసాము.