https://oktelugu.com/

Chapati : చపాతీ అంటే ప్రాణమా? ఎక్కువ తింటున్నారా? మీ పని అయిపోయినట్టే..

చపాతీ లేకుండా వారికి రోజు గడవదంటే నమ్మరు కావచ్చు మీరు. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడుతున్నవారు ఈ చపాతీ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యానికి సొంతం చేసుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం చపాతీ తినడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..

Written By:
  • Neelambaram
  • , Updated On : October 23, 2024 10:23 pm
    Chapati

    Chapati

    Follow us on

    Chapati : చపాతీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ ను చాలా మంది ఇష్టపడతారు కూడా. సింపుల్ గా ఉండే ఈ ఫుడ్ ను వెయిట్ లాస్ కోసం వినియోగిస్తారు. ఎందుకంటే చపాతీ అంటే వెంటనే మన గుర్తుకు వచ్చేది వెయిట్‌లాస్‌ బెస్ట్ డైట్ ఫుడ్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా మందికి ప్రధాన ఆహారం ఈ చపాతీనే. చపాతీ లేకుండా వారికి రోజు గడవదంటే నమ్మరు కావచ్చు మీరు. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడుతున్నవారు ఈ చపాతీ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యానికి సొంతం చేసుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం చపాతీ తినడం మానుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..

    అలసటతో బాధపడేవారు
    ఎప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అయితే మీరు కచ్చితంగా చపాతీ తినకపోవడమే మంచిది. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి. ఇది శక్తిని తగ్గించి ఆకలిని పెంచుతుంది. కాబట్టి, అలసటగా ఉంటే చపాతీ తినకపోవడమే మంచిది.

    థైరాయిడ్ సమస్య
    మీకు ఏదైనా థైరాయిడ్ సమస్య ఉంటే చపాతీకి దూరంగా ఉండటమే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వల్ల థైరాయిడ్ సమస్య కూడా తీవ్రం అవుతుంది అంటున్నారు నిపుణులు.

    మధుమేహ వ్యాధిగ్రస్తులు:
    ఇటీవలి కాలంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నానికి బదులు గోధుమ చపాతీ ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు చపాతీ తినకపోవడమే బెటర్. ఇందులో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు చపాతీని తక్కువగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

    అధిక బరువు
    చాలామంది అన్నం మానేసి చపాతీ తింటారు. అయితే చపాతీలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారనిపిస్తుంది. గోధుమల్లో ఉండే గ్లూటెన్‌లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వును నిల్వ చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. లేదంటే ఇవి చాలా సులభంగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి వీలైనంత వరకు చపాతీకి దూరంగా ఉండటం మంచిది.

    జీర్ణ సమస్యలు ఉన్నవారు
    చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..