Horoscope Today: 2024 మే 24 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి, అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారి ఆరోగ్యంపై ప్రభావం ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. కొన్ని రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. బావోద్వేగాలకు లోను కాకుండా ఉండాలి. పనిలో సహనంతో ఉండాలి. పై అధికారుల నుంచి సలహా తీసుకోవాలి.
మిథున రాశి:
కొన్ని పనుల కోసం కష్టపడాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి.
కర్కాటక రాశి:
ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. కొన్ని తప్పులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం వెచ్చిస్తారు.
సింహారాశి:
వ్యాపారంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పుతో పనిచేయడం అలవాటు చేసుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి.
కన్య రాశి:
అరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. విద్యార్థుల కెరీర్ పై ఫోకస్ చేస్తారు. కొన్ని అనుభవాలు వ్యాపారంలో పనిచేస్తాయి.
తుల రాశి:
ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొత్త విషయాను నేర్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి:
కొందరు వ్యక్తుల నుంచి ప్రత్యేక బహుమతి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి కృషి చేస్తారు.
ధనస్సు రాశి:
ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
మకర రాశి:
విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కుంభరాశి:
బంధువులతో వివాదం ఉంటుంది. రాజకీయాలకు దూరంగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనరాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూవారి పనులు కష్టంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు బిజీ వాతావరణంలో ఉంటారు.