Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు లక్ష్మీదేవి అనుగ్రహం.. ఆకస్మిక ధన లాభం..

ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ‘దీపావళి’ పండుగే. ఏ పని చేపట్టినా విజయమే అవుతుంది. కొందరు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Written By: Srinivas, Updated On : October 31, 2024 7:44 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో ప్రతీ యోగం ఏర్పడనుంది. మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా కొన్ని రాశుల వ్యాపారులకు అనుకోని అదృష్టం కలగనుంది. వీరిపై లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ సందర్భంగా మేషంతో సహా 12 రాశుల ఫలితాల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్లండి..

మేష రాశి:
ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ‘దీపావళి’ పండుగే. ఏ పని చేపట్టినా విజయమే అవుతుంది. కొందరు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:
వ్యాపారులకు ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఊహించని మార్గం నుంచి డబ్బు సాయం అందుతుంది. ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులు ఈరోజుతో పూర్తవుతాయి. డబ్బు విషయంలోవాదనలకు దూరంగా ఉండాలి.

మిథున రాశి:
వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. అనుకోకుండా అదృష్టం కలుగుతుంది. కొన్ని దానాల వల్ల పుణ్యపలం పొందుతారు. మానసికొంగా కాస్త ఆందోళనగా ఉంటారు.

కర్కాటక రాశి:
స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కొత్తగా చేపట్టే పనులు పూర్తువుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద సమస్య నుంచి బయటపడుతారు. అనేక రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.

సింహారాశి:
ఈ రాశి వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఉద్యోగుతు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ సమస్యల నుంచి బయటపడుతారు.

కన్య రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

తుల రాశి:
ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా దానిని పూర్తి చేయాలి. ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి శత్రువుల బెడద ఉండనుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి:
ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా అంతేస్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి:
ఈ రాశి వ్యాపారులకు ఆదాయం అంతం మాత్రంగానే ఉంటుంది. ఇంట్లో జరిగే శుభకార్యక్రమాల గురించి చర్చిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి:
ఏదైనా పనిని పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు. కొన్ని రంగాల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఇవి లిసి వస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

మీనరాశి:
హడావుడిగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.