https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అందరూ కలిసి నన్ను మోసం చేసారంటూ వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన నిఖిల్..యష్మీ తో లవ్ బ్రేకప్!

నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ ఏడవడంలో కూడా ఒక అర్థం ఉంది. యష్మీ టీం లీడర్ గా టాస్క్ మొదలయ్యే ముందు చాలా తెలివైన ఎత్తులు వేసింది. పృథ్వీ, నబీల్ తో మేము మీ దగ్గరకి రాము, మీరు కూడా మా దగ్గరకి రాకండి, మనం గెలిచినా తర్వాత ఎల్లో కార్డు బ్లూ టీం కి ఇద్దాము అని చెప్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 08:10 AM IST

    Bigg Boss Telugu 8(181)

    Follow us on

    Bigg Boss Telugu 8: మొన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో జరిగిన ‘పానీ పట్ యుద్ధం’ అనే టాస్క్ లో నిఖిల్ ఎంత క్రూరంగా ఆడాడో మనమంతా చూసాము. అసలు అకస్మాత్తుగా ఏమైంది ఇతనికి?, దెయ్యం పట్టిందా అని ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. గౌతమ్ మీద ఉన్న కోపంతోనే ఆయన అదంతా చేసాడని ఆ తర్వాత తెలిసింది. మొదటి రోజు నుండి నిఖిల్ రెచ్చగొడితే రెచ్చిపోయే రకంగా హౌస్ లో ఉండేవాడు కాదు. చాలా కూల్ గా ఉండేవాడు, ప్రతీ విషయంలోనూ పెద్ద మనిషి లాగా ఆలోచించి మాట్లాడేవాడు. కానీ గౌతమ్ విషయంలో మాత్రం వాడు రెచ్చగొట్టబట్టే అలా ఆడాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ ఏడవడంలో కూడా ఒక అర్థం ఉంది. యష్మీ టీం లీడర్ గా టాస్క్ మొదలయ్యే ముందు చాలా తెలివైన ఎత్తులు వేసింది. పృథ్వీ, నబీల్ తో మేము మీ దగ్గరకి రాము, మీరు కూడా మా దగ్గరకి రాకండి, మనం గెలిచినా తర్వాత ఎల్లో కార్డు బ్లూ టీం కి ఇద్దాము అని చెప్తుంది.

    ఈ విషయాన్ని పృథ్వీ నిన్న నిఖిల్ కి చెప్పేస్తాడు. అప్పుడు నిఖిల్ అందరూ ఏకమై నా మీద టార్గెట్ చేసినట్టు అయ్యింది అని పృథ్వీ తో అంటాడు. అప్పుడే యష్మీ నిఖిల్ ని కౌగలించుకునేందుకు వస్తుంది. అప్పుడు నిఖిల్ కోపంతో నాకు అవసరం లేదు వెళ్ళిపో అని అరుస్తాడు. ఇలా చేయకు నేను కేవలం స్నేహితురాలిగా కౌగలించుకోవాలని అనుకుంటున్నాను అంటుంది. నాకు అవసరం లేదు అసలు, ఇక నుండి నేను ఎవరితో మాట్లాడను, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నేనొక్కడినే సోలో గా గేమ్ ఆడుకుంటాను, ఉన్నన్ని రోజులు ఉంటాను , ఆ తర్వాత వెళ్తాను, తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే బాగుండును అని అంటాడు. ఎవరు చేసినా నేను పట్టించుకోను కానీ, ఈ అమ్మాయి నాకు వెన్నుపోటు పొడిచింది, టాస్క్ లో భాగంగా అలోచించి తెలివిగా ఆడింది, నేను అర్థం చేసుకోగలను.

    కానీ వీళ్ళు ఎందుకు నేను గేమ్ ఆడితే తీసుకోలేకపోతున్నారు రా అని పృథ్వీ తో మాట్లాడుతూ ఏడ్చేస్తాడు. అప్పుడు యష్మీ నేను కేవలం నా టీం గురించి ఆలోచించాను అని అనగా, మరి నేను కూడా నా టీం గురించే కదా ఆలోచించాను అని అంటాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నేను మీతో మాట్లాడను, మన రిలేషన్స్ ఏవైనా ఉంటే బయట చూసుకుందాం అని అంటాడు. నిఖిల్ బాధలో అర్థం ఉంది కానీ, అంత వయలెంట్ గా ఆడాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్లిష్టమైన సమయంలోనే నిజమైన క్యారక్టర్ బయటపడుతుంది. గౌతమ్ 10 శాతం తప్పు చేస్తే, నిఖిల్ 200 శాతం తప్పు చేసి చూపించాడు. దీనిపై నాగార్జున రియాక్షన్ ఈ వీకెండ్ లో ఎలా ఉంటుందో చూడాలి.