KA Movie Review: క ఫుల్ మూవీ రివ్యూ…

గత కొద్ది రోజుల నుంచి ఆయనకి ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఆయన వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన క అనే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే...ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను అలరించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : October 31, 2024 7:37 am

KA Movie Review

Follow us on

KA Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఇక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న నటుడు కిరణ్ అబ్బవరం…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేస్తూన్నారు. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయనకి ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఆయన వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన క అనే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే…ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను అలరించిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే వ్యక్తి అమ్మానాన్న లేని అనాధగా ఒక అనాధ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఒక అమ్మ కొడుకుకి రాసిన ఉత్తరాన్ని చదువుతాడు. ఆ లెటర్ లో ఉన్న అక్షరాలను చదివిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ ఉంటే కూడా ఇలానే రాసి ఉండేదేమో అని అనుకుంటాడు. ఇక అప్పటినుంచి అందరి లెటర్లని చదవడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.

ఇక కాలక్రమంలో వాసుదేవ్ కృష్ణ గిరి అనే ఊళ్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ అందరి లెటర్లను చదువుతూ అన్ని విషయాలను తెలుసుకుంటాడు. ఇక అప్పుడే ఆయనకి సత్యభామ(తన్వి రామ్) పరిచయం అవుతుంది. ఇక ఆ ఊరిలో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అసలు ఇవి ఎవరు చేస్తున్నారు. వాళ్ళని వాసుదేవ్ పట్టుకున్నాడా.?వాసుదేవ్ కి సత్యభామ తో పెళ్ళి అయిందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను సుజిత్ సందీప్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ముందుకు సాగింది. నిజానికైతే ఈ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని చేశారనే చెప్పాలి. కథ ఓకే అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే లో మాత్రం చాలా వైవిధ్యమైన ఎలిమెంట్స్ ని వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి.

ఎందుకంటే సినిమా మొత్తం ఒకెత్తయితే, క్లైమాక్స్ మాత్రం పీక్స్ లో ఉంది. ఇక ఇలాంటి క్లైమాక్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ డల్ అయిందని మనం అనుకునే లోపే క్లైమాక్స్ లో ఒక అద్భుతాన్ని చూపించారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ దర్శకులకు స్క్రీన్ ప్లే మీద బాగా పట్టున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు అవ్వడం వల్ల క్రెడిట్ ఇద్దరికి దక్కుతుంది. ముఖ్యంగా సినిమా లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. ఇక మొదటి నుంచి చివరి వరకు బోర్ కొట్టించకుండా సాగుతుంది.

అలాగే సినిమాలో ఉన్న కొన్ని పాయింట్స్ కి చివర్లో ఇచ్చిన కన్ క్లూజన్ కూడా చాలా బాగా వర్క్ ఔట్ అయింది. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్లకు చాలావరకు హెల్ప్ అయింది. ముఖ్యంగా సస్పెన్స్ కల్పించే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండడం విశేషం. వాటన్నింటిని ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలిపిందనే చెప్పాలి…ఇక ఫస్ట్ హాఫ్ నార్మల్ గా సాగుతున్నప్పటికి ఇంటర్వెల్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుడికి ఒక థ్రిల్ ఫీల్ ఇచ్చాడు. ఇక సెకండాఫ్ లో కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించినప్పటికీ ట్విస్టులతో నడిపించారు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమాని ఒక్కడే తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇక మొదటి నుంచి చివరి వరకు తను ఈ సినిమాని ఎక్స్ట్రా ఆర్డినరీగా నడిపించాడు. ముఖ్యంగా ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఆయన ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలావరకు ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాలో తను చాలా కష్టపడ్డాడనే విషయం మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది…

ఇక హీరోయిన్ తన్వి రామ్ చేసిన సత్యభామ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కథలో అంతర్లీనంగా ఉన్న ఈ క్యారెక్టర్ చూడ చక్కగా ఉంది. అలాగే ఈ సినిమాకి ఆమె చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి… ఇక నయన్ సారిక కూడా చాలా మంచి పాత్రను పోషించింది. అచ్యుత్ కుమార్ లాంటి నటుడు కూడా ఒక కీలక పాత్రలో నటించాడు…అలాగే మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఓవరాల్ గా అందరు తమ తమ నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో సాంగ్స్ అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది l. ఇక మధ్య మధ్యలో వచ్చే ఒక హుక్ బ్యా గ్రౌండ్ స్కోర్ అయితే సిచువేషన్ కు తగ్గట్టుగా వాడుతూ సీన్లో ప్రేక్షకుడిని లీనమయ్యే విధంగా కన్వే చేశారు…ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా తీశారు.

ఇక ఈ సినిమా బాగా రావడానికి విజువల్స్ కూడా ముఖ్యపాత్ర వహించాయి. ఇక ఎడిటర్ కూడా చాలా వరకు తన బాధ్యతని నిర్వర్తించాడనే చెప్పాలి. అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొంతవరకు సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించినప్పటికి దర్శకుడు సలహా మేరకు ఆ సీన్ లను కట్ చేయలేకపోవచ్చు… ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

కిరణ్ అబ్బవరం యాక్టింగ్
తన్వి రామ్
స్క్రీన్ ప్లే
ట్విస్టు లు

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది…
షార్ప్ ఎడిట్ లేకపోవడం…

రేటింగ్

ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్

ఈ పండక్కి ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా