Homeఆధ్యాత్మికంToday 17 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు...

Today 17 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు మూటలు లెక్క పెట్టుకుంటారు..

Today 17 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఈరోజు కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులకు అధిక లాభాలు రానున్నాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయము ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈరోజు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన సమాచారం అందుతుంది. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు రానున్నాయి. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పులను తీర్చడంలో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూస్తారు. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనవసరపు వివాదాల్లోకి తరలించకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు పొదుపు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు అవసరమైతే తప్ప రుణాలు తీసుకోకూడదు. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version