https://oktelugu.com/

Cucumber: ఈ ఒక్క కాయ చాలు.. రెగ్యూలర్ గా తింటే ఇక విటమిన్లు, ఖనిజాల కోసం వెతకన్నక్కర్లేదు.. !

ఆరోగ్యం కోసం కొందరు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ప్రోటీన్లు కావడానికి ఏవేవో పదార్థాలు తీసుకుంటారు. కానీ కాయలు, పండ్లల్లో ఉన్న ప్రయోజనాలు ఎంత ఖర్చు చేసినా.. మిగతా పదార్థాల్లో లభించవు. అయితే మార్కెట్లో రెగ్యులర్ గా ఎప్పటికీ అందుబాటులో ఉండే కీర దోశ(CUCUMBER)లో ఊహించనన్ని పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 15, 2024 / 06:00 AM IST

    Cucumber

    Follow us on

    Cucumber: నేటి కాలంలో చాలా మంది ఆరోగ్యంపై కేర్ తీసుకుంటున్నారు. వాతావరణ కాలుష్యంతో పాటు నాణ్యమైన ఆహారం లభించకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటున్నారు. వీటిలో పండ్లు ప్రధానమైనవి. వైద్యులు సైతం కొన్ని సందర్భంగాల్లో రోజూ తినే ఆహారం కంటే పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వీటి వల్ల తక్షణ ఎనర్జీతో పాటు అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే కొన్ని పండ్లలో విటమిన్లు ఉంటాయి..మరికొన్నింటిలో ఖనిజాలు ఉంటాయి. కానీ ఈ కాయలో మాత్రం బోలెడ్ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ ఒక్క కాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల భారీగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే?

    ఆరోగ్యం కోసం కొందరు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ప్రోటీన్లు కావడానికి ఏవేవో పదార్థాలు తీసుకుంటారు. కానీ కాయలు, పండ్లల్లో ఉన్న ప్రయోజనాలు ఎంత ఖర్చు చేసినా.. మిగతా పదార్థాల్లో లభించవు. అయితే మార్కెట్లో రెగ్యులర్ గా ఎప్పటికీ అందుబాటులో ఉండే కీర దోశ(CUCUMBER)లో ఊహించనన్ని పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అందుకే ఇవి మార్కెట్లో కనిపించినా పెద్దగా పట్టించుకోరు. కానీ కుకుంబర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తేమాత్రం అస్సలు విడిచిపెట్టరు. ఇంతకీ ఇందులో ఉన్న ఖనిజాలు, విటమిన్లు ఏంటంటే?

    మార్కెట్లో ఎప్పటికీ లభించి కీర దోశలో Vitamin A, Vitamin C, Vitamin K, Vitamin B అనేవి ఉంటాయి. దీంతో కీర దోశను తీసుకోవడం వల్ల కళ్లకు చాలా మంచిది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తక్షణ ఎనర్జీ వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే కీర దోశ మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇక చాలా మందికి నేటి కాలంలో విటమిన్ బి లోపంతో బాధపడుతున్నారు. దీంతో కుకుంబర్ ను రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

    కీర దోశలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా కొన్ని జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారు. ఈ బరువు తగ్గడానికి కీర దోశ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఎలాంటి డైజేషన్ లేకుండా కడుపు నిండినట్లు ఉండడానికి ఇది మంచి ప్రూట్ గా పనిచేస్తుంది.

    రెగ్యులర్ గా కుకుంబర్ తీసుకోవడం వల్ల గుండె సమస్య నుంచి బయపడొచ్చు. ఇది తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్తకణాల్లోఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటుంది. కొందరు సాయంత్రం ఆహారానికి బదులు ఇతర టిఫిన్లు చేస్తుంటారు. కానీ వాటికి బదులు కుటుంబర్ ను తీసుకోవడం వల్ల ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. మెదడులో ఎలాంటి సమస్యలు ఉన్నా కీర దోశ పరిష్కరిస్తుంది. ఇక అధిక ఉష్ణోగ్రతతో బాధపడేవారు కీరదోశ తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. ఈ నేపథ్యంలో కీర దోశను రెగ్యులర్ ఆహారంలో తీసకునే ప్రయత్నం చేయండి..