https://oktelugu.com/

Horoscope Today : ఈరోజు సిద్ధయోగం కారణంగా ఈ రాశుల వారికి అనుకోకుండా సంపద పెరిగే అవకాశం…

ప్రియమైన వారి కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2024 / 08:04 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఆదివారం ద్వాదశరాసులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో సిద్దయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనూహ్యంగా సంపద పెరిగే అవకాశం. వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి: ఈ రాశి వారికి చట్టపరమైన చిక్కులు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబంలో వాగ్వాదాలు ఏర్పడతాయి. విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారు వాయిదా వేసుకోవడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    వృషభరాశి: ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యయం చేయాలి. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. అందువల్ల మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి: ఎవరి దగ్గరనైనా డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. తల్లిదండ్రుల మద్దతుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది.

    కర్కాటక రాశి: వ్యాపారులు భాగస్వాముల నుంచి శుభవార్తలు వింటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని పార్టీల్లో పాల్గొంటారు.

    సింహా రాశి: కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులను కలుస్తారు.

    కన్యరాశి: సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రసంగంలో మాటలను నియంత్రించాలి. అనుకోని విధంగా డబ్బు రావడంతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తగా రుణం తీసుకునే వారికి జాగ్రత్తలు అవసరం. వ్యాపారులు ఆర్థికంగా పురోగతిని చూస్తారు. దీంతో సంతోషంగా ఉంటారు.

    తుల రాశి: వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. కొన్ని అవసరాలకు అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది.

    వృశ్చిక రాశి: ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. దీంతో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల దగ్గర నుంచి ధన సహాయమందుతుంది.

    ధనస్సు రాశి: పెండింగ్ పనులను పూర్తి చేయాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు .కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. బంధువుల్లో ఒకరి వివాహానికి హాజరవుతారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు తొలగిపోతాయి.

    మకర రాశి: వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇవి భవిష్యత్తుకు ప్రయోజనాలు కలిగించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఇంట్లో అవసరాలకు అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది. విద్యార్థులు కొత్త కోర్సులో చేరాలనుకుంటే ఇదే మంచి సమయం.

    కుంభ రాశి: పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామికి విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

    మీనరాశి: ఉద్యోగులు లక్ష్యాలను పూర్తిచేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు ఉంటాయి.