https://oktelugu.com/

Elon Musk: ఇజ్రయెల్‌ అధ్యక్షుడితో ఎలాన్‌ మస్క్‌ కీలక చర్చలు.. యుద్ధం ఆపుతాడా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానని రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చారు. యుద్ధాలతో అమెరికా సంపద ఆవిరవుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 8, 2024 / 07:00 AM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. తనను అధ్యక్షుడిగా గెలిపిస్తే యుద్ధాలు ఆపేస్తానన్న రిపబిలకన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నే అమెరికన్లు గెలిపించారు. 2025, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌.. తన మంత్రివర్గం కూర్పు పనుల్లో బిజీగా ఉన్నారు. వైట్‌హౌస్‌తోపాటు, కీలక శాఖలకు అధిపతులను నియమిస్తున్నారు. డోజ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ) అనే పోస్టును సృష్టించారు. ఆ పదవికి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తోపాటు, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామిని కో చైర్మన్లుగా నియమించారు. కొత్తగా ఏర్పడే ట్రంప్‌ ప్రభుత్వంలో ఈ పదవి చాలా కీలకం. ఈ నేపథ్యంలో ట్రంప్‌ బాధ్యతలు చేపట్టక ముందే యుద్ధాలు ఆపే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎలాన్‌ మస్క్‌.. ఇటీవల ఇరాన్‌ విదేశాంగ శాక కార్యదర్శితో రహస్యంగా చర్చలు జరిపారు. తాపాగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడితో మంతనాలు సాగించారు.

    బందీల విడుదల కోసం..
    హమాస్‌ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్‌ పౌరులను విడుదల చేయాలని ట్రంప్‌ ఇటీవలే వార్నింగ్‌ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టే లోగా విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో తాజాగా ఎలాన్‌ మస్క్‌ మరోమారు రంగంలోకి దిగారు. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌తో మంతనాలు జరిపారు. గాజాలో హమాస్‌ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడిపించే విషయంపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.

    ఒత్తిడి తెవాలని వినతి..
    బందీలను మిలిటెంట్లు విడిచిపెట్టేలా హమాస్‌పై ఒత్తిడి తేవాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షడు హెర్జోగ్‌ విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే చాలా మందిని విడిపించామని, కొద్ది మంది ఉన్నారని వారిని విడిపిస్తే యుద్ధం ఆపుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ట్రప్‌ వార్నింగ్‌ నేపథ్యంలో బందీల విడుదలపై మస్క్‌ దృష్టి పెట్టారు. తాజా చర్చలతో బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

    అధ్యక్షుడికి వినతి..
    బందీలను విడిపించాలని వారి కుటుంబ సభ్యులు ఇటీవలే ఇజ్రాయెల్‌ అధ్యక్షుడిని కలిశారు. ఈమేరకు స్పందించిన హెర్జోగ్‌ బాధితుల తరఫున మస్క్‌తో చర్చలు జరిపారని సమాచారం. మరి ఈ చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.