Pushpa 2 The Rule : : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తు రెండు రోజుల్లోనే 450 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తన స్టామినాను చూపిస్తూ ముందుకు సాగిన ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధించిందనే చెప్పాలి. అలాగే ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లను కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇక ఇప్పటినుంచే భారీ లెక్కలు అయితే వేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ ముగిసిన తర్వాత ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి రాని గుర్తింపు అల్లు అర్జున్ తెచ్చుకుంటున్నాడనే చెప్పాలి. ఆయన ఇంతకు ముందు చేసిన అద్భుతాలు అంతా ఇంతా కాదు.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి నటుడు మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు సంపాదిస్తున్న సక్సెస్ లే ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టాయి. మరి ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమాతో తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక సీన్ లో అల్లు అర్జున్ ఏడ్చి ప్రేక్షకులందరిని కూడా ఏడిపించాడు. క్లైమాక్స్ లో వచ్చే సీన్ లో అజయ్ వచ్చి వాడు నా తమ్ముడు అని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ఏడవటమే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులందరిని కూడా ఏడిపించడం విశేషం…
ఇక పుష్ప సినిమాలో నటించిన నటన ఒకెత్తయితే పుష్ప 2 సినిమాలో అంతకుమించి నటించాడు. మరి ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకోవడం విశేషం…