Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 2న ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఓ రాశి వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. మరో రాశి వారికి కష్టాలు వచ్చినా కొందరు ఆదుకుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఆకస్మాత్తుగా కష్టాలు వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడుతాయి. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులకు ప్రయోజనాలు ఉండే అవకాశం.
వృషభ రాశి:
వివాహితులకు అనుకూల వాతావరణం. భాగస్వామిపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
మిథునం:
ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కష్టసమయంలో కొందరు ఆదుకుంటారు. ప్రియమైన వారితో ఎక్కువగా వాదనలు చేయొద్దు.
కర్కాటకం:
కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
సింహ:
వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. విహారయాత్రల్లో ఉంటారు. ప్రియమైన వారితో కొన్ని వాదనలు జరగవచ్చు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
కన్య:
మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల వాతావరణం.
తుల:
ఆదాయ వనరులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అనవసర వాదనలకు దిగొద్దు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది.
ధనస్సు:
వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగుపడుతాయి. భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం.
మకర:
వ్యాపారులకు అనుకూల ఫలితాలు. వ్యక్తిగత జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగులకు ఇతరులతో మద్దతు ఉంటుంది.
కుంభం:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సంబంధాలు మెరుగుపడుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
మీనం:
ఉద్యోగులకు కార్యాలయంలో ప్రయోజనాలు ఉంటాయి. అన్నిరంగాల వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు.