AP Survey: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అభ్యర్థులను దశలవారీగా ప్రకటించి పోటీకి సై అంటే సై అంటున్నాయి. వై నాట్ 175 అని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటుంటే.. ఈసారి మార్పు తద్యమని టిడిపి+ జనసేన కూటమి వ్యాఖ్యానిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చెబుతున్నారు. బిజెపి కూడా ఈసారి కొద్దో గొప్పో సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి చెప్తున్నారు. ఎన్నికలన్నాక నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే. కానీ అంతిమంగా గెలవడం ముఖ్యం. మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు? 2019 నాటి పరిస్థితులు ఉంటాయా? లేక ఈసారి ఏమైనా మారుతాయా?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ పల్స్ ఓ సర్వే సంస్థ ఆ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలను వెల్లడించింది. ఈ సంస్థ తీసుకున్న శాంపిల్ కూడా ఒకింత బెటర్ గానే ఉంది. దాదాపు ఈ సంస్థ 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను కవర్ చేసినట్లు చెబుతోంది. వారు చెప్పిన అంశాల ఆధారంగా పలు వివరాలను ఈ సంస్థ క్రోడీకరించింది. అందులో ప్రధానమైనది ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నలకు పబ్లిక్ పల్స్ అనే సంస్థ రెండవ మాటకు తావు లేకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు ఏకంగా 122 సీట్లు వీటికి పది పెరగవచ్చు లేదా పది తగ్గవచ్చు. అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ అవతరిస్తుంది అని చెప్పింది. అంతేకాదు 49.14% ఓటు బ్యాంకు సొంతం చేసుకుంటుందని ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇదే వైసిపి ఎటువంటి పొత్తు లేకుండా 151 సీట్లు సాధించింది. 49.95% ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో టిడిపి+ జనసేన కూటమి 53 స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ సీట్లకు 10 పెరగొచ్చు లేదా పది తగ్గొచ్చు అని పబ్లిక్ పల్స్ చెబుతోంది. ఇక ఈసారి ఓటు బ్యాంకు 44.34 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఇక గత ఎన్నికల్లో టిడిపి ఎటువంటి పొత్తు లేకుండానే 23 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో టిడిపి ఓటు శాతం 39.17. ఒక గత ఎన్నికల్లో బిజెపి ఎటువంటి సీట్లు గెలుచుకుపోయినప్పటికీ 6.24% ఓట్లను సాధించింది. ఎన్నికల్లో అది 0.56 శాతానికి పడిపోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 1.17% ఓట్లను సాధించగా.. ఈసారి 1.21% శాతానికి పడిపోనుంది. ఇక ఇతరులు 4.75 శాతం ఓట్లను సాధిస్తారని పబ్లిక్ పల్స్ ప్రకటించింది.
కేవలం గెలుపు ఓటమి మాత్రమే కాకుండా ఏ ఏ వయసు గ్రూపు వారు.. ఏ ఏ పార్టీకి జై కొడుతున్నారో పబ్లిక్ పల్స్ లెక్కలతో సహా వివరించింది. 18_30 సంవత్సరాల వయసున్నవారిలో వైసీపీకి 43.04 % జై కొడుతున్నారు. టిడిపి+ జన సేన కూటమి వైపు 53.05 % మంది మొగ్గు చూపుతున్నారు. బిజెపి వైపు 0.38% మంది, కాంగ్రెస్ వైపూ 0.38 % మంది ఓకే అంటున్నారు. ఇతరుల వైపు 3.15 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.. ఇక 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వారిలో వైసీపీ వైపు 50.72 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. టిడిపి+ జనసేన కూటమి వైపు 45.56 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.36%, కాంగ్రెస్ వైపు 0.57 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు. ఇతరుల వైపు 2.79 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. 45_60 మధ్య వయసు గ్రూప్ లో 55% మంది వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. టీడీపీ+ జనసేన కూటమి వైపు 41.95 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.29 శాతం మంది, కాంగ్రెస్ వైపు 0.48 % మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇతరుల వైపు 2.28 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. 60 సంవత్సరాల వయసున్నవారిలో 57.07% వైసిపి వైపు, 40.51% జనసేన+ టిడిపి, 0.27% బీజేపీ, 0.31% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలప్పుడు ఇలాంటి సర్వేలు చాలానే వస్తాయి. ఇక్కడ సర్వే సంస్థలను పట్టలేము గాని.. అంతిమంగా జనం మూడ్ పసిగడితేనే సర్వే సంస్థలు చేసిన సర్వేకు సార్థకత ఉంటుంది.