Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 9న ద్వాదశ రాశులపై శ్రవణా నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. అలాగే ఈరోజు అమావాస్య కావడంతో ఓ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరో రాశి వారు నిర్లక్ల్యాన్ని వీడితేనె ప్రయోజనాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరాశివారికి ఈరోజు అన్నీ శుభాలే జరుగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
వృషభ రాశి:
జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఆదాయం సమకూరుతుంది. కొత్త వస్తువులు కొనేముందు కాస్త ఆలోచించాలి. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
మిథునం:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఏదైనా పని విషయంలో నిర్లక్ష్యాన్ని వీడితేనే సక్సెస్ అవుతాయి.
కర్కాటకం:
స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన పెద్దల సలహాలు తీసుకోవాలి.
సింహ:
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల వాతావరనం ఉంటుంది. కటుుంబ సభ్యులతో గొడవలు పడుతారు. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది.
కన్య:
వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. గతంలో ఉన్న సమస్యలు మరోసారి వేధించవచ్చు. కొన్ని విషయాల్లో ఇతరుల సాయం తీసుకోవచ్చు. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి.
తుల:
ఓ సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచాలి. వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉంటారు.
వృశ్చికం:
ప్రియమన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. అనుకోకుండా ఆస్తి వస్తుంది. ఉద్యోగులు తోటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి.
ధనస్సు:
భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగు రుణాలను చెల్లించాలి. వ్యాపారులకు కాస్త ఇబ్బంది వాతావరణం ఉంటుంది.
మకర:
చిన్న పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తులకు అనుకూల వాతావరణం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు.
కుంభం:
వ్యాపారులకు అనుకూల వాతావరణం. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మీనం:
ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కాంట్రాక్టు వ్యాపారులకు అనుకూల వాతావరణం. ఏదైనా పనిని నిజాయితీగా చేయాలి. వక్రమార్గంలో వెళితే కష్టాలు ఉంటాయి.