Mahesh Babu And Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సినిమాలు చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ లను తీసుకుంటూ వాటిని ఏం చేస్తారు అనే డౌట్ అయితే అందరిలో ఉంటుంది. నిజానికి మన హీరోలు సినిమాల వల్ల గాని అడ్వ టైజ్ మెంట్ల వల్ల గాని వచ్చే డబ్బులను చాలా వ్యాపారాలమీద అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో బిజినెస్ ల పరంగా ఎక్కువ గా ఆదాయం సంపాదిస్తూ ముందుకు దూసుకెళ్ళే హీరోలు మాత్రం ఇద్దరే ఉన్నారు.
వాళ్ళు ఎవరు అంటే ఒకరు కింగ్ నాగార్జున కాగా, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్లిద్దరు తెలుగు హీరోల్లో టాప్ బిజినెస్ మ్యాన్లు గా కూడా కొనసాగుతున్నారు. ఇక వీళ్ళకి చాలా బిజినెస్ లు ఉన్నాయి. వాటి ద్వారా లాభాలను కూడా భారీగానే ఆర్జిస్తున్నారు. నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియో తో పాటుగా, హైద్రాబాద్ లోనే చాలా రెస్టారెంట్లు, హోటళ్ళు రిసార్ట్ లు కూడా చాలా ఉన్నాయి.
అలాగే మహేష్ బాబు కి ఏ ఎం బి మాల్, భారీ రెస్టారెంట్లు , రిసార్ట్ లు ఉన్నాయి ఇక వీటి ద్వారానే మహేష్ బాబు నికర ఆదాయం కూడా రోజురోజుకీ భారీగా పెరిగిపోతుందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మన హీరోల బిజినెస్ లను చూసుకుంటే వాళ్ళు సినిమాల్లో సంపాదించే దాని కంటే బిజినెస్ లోనే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రతి హీరో కూడా సైడ్ ఇన్ కమ్ గా బిజినెస్ లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోగా కెరియర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలీదు. ఒక్క ఫ్లాప్ వస్తే రావాల్సిన 4 అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి.
అలాంటి క్రమంలో సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే కరెక్ట్ అంటూ పలువురు విమర్శకులు సైతం మన హీరోలను హెచ్చరిస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో నాగార్జున, మహేష్ బాబు మాత్రం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారనే చెప్పాలి…వీళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములని బాగా వాడుతున్నారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు…