Homeఆధ్యాత్మికంHoroscope Today: ఉత్పన్న ఏకాదశి వేళ.. ఈరోజు ఈ రాశుల వారికి బంగారు బాట..

Horoscope Today: ఉత్పన్న ఏకాదశి వేళ.. ఈరోజు ఈ రాశుల వారికి బంగారు బాట..

పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు ధన సాయం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు అనుకోని ఆదాయం వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు ఏకాదశి కావడంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భగా మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాల్లో ఎటువంటి మార్పులు ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు ధన సాయం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు అనుకోని ఆదాయం వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి:
ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలం. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఆందోళనలో తలదూర్చకుండా ఉండాలి.

మిథున రాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి లక్ష్యం పూర్తి చేయడానికి సహకరిస్తాయి. బంధువుల్లో ఒకరి ప్రవర్తనతో ఇబ్బంది పడుతారు. శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం.

కర్కాటక రాశి:
ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ విషయాలు ఇతరులకు చెప్పుకోవద్దు. వ్యాపారులు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయాణాలు చేస్తారు.

సింహా రాశి:
బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. ఇవి వ్యాపారులకు లాభిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

కన్యరాశి:
వ్యాపారులకు శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనిని ఇన్ టైంలో పూర్తి చేస్తారు. బ్యాంకు రుణం రావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి:
ఉద్యోగులు కొన్ని పనుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఫైనల్ గా ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడుతారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని సంఘటనలతో నిరుత్సాహ పరుస్తాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనస్సు రాశి:
పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఓ సమారం మానసికంగా ఉల్లాసానికి గురి చేస్తుంది. ఉద్యోగులు కంపెనీలు మారే అవకాశం. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.

మకర రాశి:
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

కుంభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తే తల్లిదండ్రుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని పొరపాట్లు చేస్తారు. అయితే శత్రువులపై కన్నేసి ఉంచండి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

మీనరాశి:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొత్తగా కొన్నిసమస్యలు ఎదుర్కొంటారు. బంధువులో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది అనుకూలమైన సమయం కాదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper