https://oktelugu.com/

Horoscope Today: అతిగండ యోగం కారణంగా ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే?

జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారు కొత్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 20, 2024 / 07:54 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు ద్వాదశ రాశులపై శతబిషా నక్షత్రం ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు.ఈరోజు అతిగండ యోగం ఏర్పడనుంది. దీంతో ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారు శుభవార్తలు వింటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అధికారులతో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

    వృషభ రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సాగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే దానిని వెంటనే తిరిగి చెల్లిస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. మనసులో కొంత ఆందోళన గా ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. శారీరక సుఖాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు.

    సింహారాశి:
    విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు తోటివారి మద్దతు పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.

    కన్య రాశి:
    అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.

    తుల రాశి:
    రాజకీయ రంగాల వారికి అనుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి. పెండింగులో ఉంటే సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు ఇప్పుడు పెట్టే పెట్టుబుడులు లాభిస్తాయి.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

    మకర రాశి:
    జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారు కొత్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

    కుంభరాశి:
    ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని అడ్డంకులు ఏర్పడినా అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. శుభకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.