Kidney damage : మీ కిడ్నీలు దెబ్బతిన్నాయని ఇలా తెలుసుకోండి.. ముందే జాగ్రత్త పడితే బెటర్

కొంతమంది ఎంత పనిచేసినా అలిసిపోరు. మరికొందరు అయితే చిన్న పనిచేసిన అలిసిపోతుంటారు. ఇలా ఏ పనిచేసిన అలిసిపోతున్నట్లయితే మీ మూత్రపిండాలు దెబ్బతిన్నాయని సందేహపడవచ్చు. అలాగే పూర్తిగా ఆకలి లేకపోతే మూత్రపిండాలు దెబ్బతిన్నట్లే. అాగే పాదాల వాపు, చీలమండలు, ఉబ్బిన కళ్లు, పొడి చర్మం, దురద వంటివి కనిపిస్తాయి.

Written By: Neelambaram, Updated On : August 19, 2024 9:01 pm

Kidney damage

Follow us on

Kidney damage ; ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. డయాబెటిస్, వృద్ధాప్యం, అధిక రక్తపోటు, జన్యులోపం వల్ల కూడా కొందరికి మూత్రపిండాల సమస్య వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. దేశంలో లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువై అంతవరకు లక్షణాలు కూడా కనిపించవు. అయితే ఈ వ్యాధిని గుర్తించాలంటే వ్యాధి నిర్ధారణ టెస్ట్ చేయించుకోవాలి. లేదా కొన్ని సంకేతాలను బట్టి కూడా కిడ్నీలు దెబ్బతిన్నాయని గుర్తించవచ్చు. అవేంటో ఈరోజు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కొంతమంది ఎంత పనిచేసినా అలిసిపోరు. మరికొందరు అయితే చిన్న పనిచేసిన అలిసిపోతుంటారు. ఇలా ఏ పనిచేసిన అలిసిపోతున్నట్లయితే మీ మూత్రపిండాలు దెబ్బతిన్నాయని సందేహపడవచ్చు. అలాగే పూర్తిగా ఆకలి లేకపోతే మూత్రపిండాలు దెబ్బతిన్నట్లే. అాగే పాదాల వాపు, చీలమండలు, ఉబ్బిన కళ్లు, పొడి చర్మం, దురద వంటివి కనిపిస్తాయి. అలాగే మూత్ర విసర్జనలో మార్పులు వచ్చిన కూడా సందేహపడవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారిలో కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. వీటితో పాటు నడుము నొప్పి, చలి జ్వరం, మూత్రంలో మంట, నడిస్తే ఆయాసం రావడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాలు దెబ్బతిన్నాయా లేదా అని గుర్తించడానికి పరీక్షలు అనేవి తప్పనిసరి. అయితే కిడ్నీలను ఆరోగ్యంగా ఉండాలంట ఆహారంలో తక్కువగా ఉప్పు తీసుకోవాలి. అధికంగా మాంసం తినకూడదు. రోజూ వ్యాయామం చేయాలి. ఆహారంలో పీచు, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. మద్యం, ధూమపానం తాగకూడదు. శరీరానికి సరిపడా నీరు తాగాలి. అలాగే వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా వాడండి. రోజూ ఓ యాపిల్ పండును తినండి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తుంది. అయితే కిడ్నీల పనితీరు మందగిస్తే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.

రోజూ ఓ యాపిల్ పండును తినండి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తుంది. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వంటి మందులు ఉపయోగిస్తే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీలు తొందరగా దెబ్బతింటాయి. గంటల తరబడి మూత్రాన్ని ఆపుకోకూడదు. ఇలా ఆపుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పడి కిడ్నీలు దెబ్బతింటాయి. శరీరానికి తగినంత నిద్ర కూడా ముఖ్యమే. కళ్ల కింద నల్లటి వలయాలు వంటివి ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. కొంతమందిలో చర్మం పొడిబారడం, చర్మ రంగు మారడం, కళ్లు ఎర్రగా ఉండటం, కంటి వాపు వంటివి లక్షణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతిన్నాయని గుర్తించవచ్చు.