https://oktelugu.com/

Tirumala: తిరుమలలో మొట్టమొదటి నివాసం ఏర్పాటు చేసుకున్న తిరుమల నంబి కథ తెలుసా?

కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పేర్కొంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు.

Written By: , Updated On : January 27, 2025 / 05:54 PM IST
Tirumala

Tirumala

Follow us on

Tirumala: కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పేర్కొంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొందరు వారం రోజుల నుంచి ప్లాన్ వేస్తారు. తిరుమలలో దేవస్థానమే కాకుండా మాడవీధులు చుట్టూ వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఆకాశగంగతో పాటు ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగిన తిరుమలలో మొట్టమొదటి నివాసి ఎవరో ఎవరైనా చెప్పగలరా..? అలా అడిగితే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంటారు.. కానీ ఆ తర్వాత ఎవరు ఇక్కడ మనిషి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారో చెప్పగలరా? అంటే కొందరు మాత్రమే చెప్పగలుగుతారు.. మరి తిరుమలలో మొట్టమొదటిసారిగా నివాసం ఏర్పరచుకున్న వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే వివరాల్లోకి వెళ్ళండి..

తిరుమల పుణ్యక్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టమని కొందరు పేర్కొంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అని మరికొందరు చెబుతూ ఉంటారు. . అలాంటి వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటిసారిగా పూజలు చేసింది తిరుమల నంబి. వెయ్యిళ్ల క్రితమే ఈయన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం నుంచి నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు. రాళ్లు రప్పలు అని చూడకుండా స్వామి వారిపై భక్తి ఏర్పరచుకొని తప్పకుండా అభిషేకం చేసేవారు.

అయితే తిరుమల నంబి కష్టాన్ని చూడలేక ఆ దేవుడు ఒక చిన్న పనిని చేశాడని అంటారు. ఒకరోజు తిరుమల నంబి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించేందుకు నీటిని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు. స్వామివారికి నీటిని తెస్తుండగా మార్గమధ్యంలో ఒక వేటగాడు వచ్చి తనకు దాహం వేస్తుందని నీటిని ఇవ్వమని కోరుతాడు. అయితే ఈ నీరు స్వామి వారి అభిషేకం కోసమని ఆ నీటిని ఇవ్వనని అంటాడు. దీంతో ఆ వేటగాడు స్వామివారికి నీటిని తెచ్చే పాత్రకు కన్నం వేస్తాడు. అలా వెనుక కారుతున్న నీటితో వేటగాడు దాహం తీర్చుకుంటాడు. అయితే స్వామివారి దగ్గరికి వచ్చేసరికి ఆ పాత్రలో ఎలాంటి నీరు ఉండదు. దీంతో తిరుమల నంబి తీవ్రంగా బాధపడతాడు.

తిరుమల నంబి బాధ చూడలేక ఆ వేటగాడు పాప వినాశనం ఉన్న గుట్టకు బాణం వేస్తాడు. ఆ బాణం తర్వాత ఆకాశగంగా పుట్టుకొస్తుంది.
అలా అప్పుడు పుట్టుకొచ్చిన ఆకాశగంగా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వేటగాడు మాయమైపోతాడు. అయితే తిరుమల శ్రీవారి కోసం నీటిని తీసుకువచ్చింది ఆ దేవుదేనని న తిరుమల నంబి అనుకుంటాడు. ఇప్పటికీ ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా తిరుమలలో మొట్టమొదటి నివాసం ఏర్పాటు చేసుకున్న తిరుమల నంబి తిరుమలలో మొదటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తిరుమలకు వెళ్లిన వారు తిరుమల నంబికి సంబంధించిన విగ్రహాన్ని చూడవచ్చు. ఇక కలియుగ దైవమైన శ్రీవారిని ప్రత్యేక రోజుల్లో కోట్లాది మంది దర్శించుకుంటారు. అలాగే శ్రీవారికి కావాల్సిన కానుకలు అందిస్తూ ఉంటారు.