Venkatesh : సినిమా హిట్ కొట్టడం ఒక్కటే కాదు, దాన్ని ప్రేక్షకులకు సరిగ్గా ప్రెజెంట్ చేయడం, ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత సినీ పరిశ్రమలో ఈ మార్కెటింగ్ స్కిల్స్ లేకుండా ఎన్ని వందల కోట్లు పెట్టినా సినిమాను జనాలు పట్టించుకోకపోవచ్చు. అందుకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిన్న దర్శకుడి నుంచి పెద్ద దర్శకుడి వరకు ప్రమోషన్ పైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈ విషయంలో హీరోల సహకారం కూడా చాలా అవసరం. కానీ, విజయ్, అజిత్, నయనతార లాంటి స్టార్లు డబ్బింగ్ చిత్రాలకు ప్రమోషన్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ మాత్రం దీనికి భిన్నంగా అసలైన కమిట్‌మెంట్, ఎనర్జీ అంటే ఏంటో నిరూపిస్తున్నారు.
వెంకీ మామ మాస్ ప్రమోషన్ స్టైల్!
వెంకటేష్ తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాల్లో ఒకటి. అయితే, సినిమా హిట్ అయ్యిందంటే అంతే.. ప్రమోషన్ నుంచి హీరోలు దూరం అయ్యే ట్రెండ్ ఉంది. కానీ వెంకీ మాత్రం విడుదలకు ముందు నుంచి ఇప్పటివరకు ప్రమోషన్లలో భాగంగా మునిగిపోయారు. రిలీజ్‌కు ముందు ఇంటర్వ్యూలు, టీవీ షోలు, బాలయ్య-రానాల టాక్ షోలు—ఏదీ వదలకుండా అందులో పాల్గొన్నారు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ మీట్‌లో నిర్మాతలు, హీరోయిన్లు రాలేకపోయినా దర్శకుడు అనిల్ రావిపూడితో కలసి తానే వచ్చారు. అంతేకాదు, భీమవరంలో రెండు వారాల తర్వాత విజయోత్సవ వేడుక నిర్వహించి, ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు స్టేజ్ మీదే డాన్స్ చేసి, పాటలు కూడా పాడారు.
యూత్‌కి వెంకటేష్ పెద్ద లెసన్!
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్‌లు కూడా వెంకటేష్ ఎనర్జీ ముందు తక్కువగానే కనిపించారు. ఆరు పదుల వయసులో కూడా ఈ స్థాయిలో చలాకీగా ప్రమోషన్లలో పాల్గొనడం చూస్తే యంగ్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే చెప్పాలి. సినిమా మంచి కంటెంట్‌తో పాటు సరైన పబ్లిసిటీ కూడా ఉంటేనే పెద్ద హిట్ అవుతుందని వెంకటేష్ మరోసారి నిరూపించారు. కేవలం నటించడమే కాదు, సినిమాను ప్రేక్షకులకు చేరవేయడం కూడా హీరోల అసలైన బాధ్యత అని వెంకీ మామ మరోసారి చూపించారు!
సంక్రాంతి సినిమాలు
ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్యే పోటీ మొదట కనిపించింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం 13రోజులైనా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ సంక్రాంతి కింగ్ అనిపించుకున్నారు వెంకీ. ఇక వెంకీ మామ నుంచి చివరగా వచ్చిన సైంధవ్ అని గత ఏడాది డిజాస్టర్ ఇచ్చాడు. కానీ ఈ సారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొన్ని చోట్ల అయితే పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా చెరిపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ రేంజ్ వసూళ్లను సాధించిన సీనియర్ ఏకైక హీరో వెంకటేష్ మాత్రమే. చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్లు దాటింది కానీ ఈ రేంజ్‌లో కలెక్షన్లు వసూలు చేయలేదు. ఇక బాలయ్య రెండు వందల కోట్ల ఫిగర్ తాకలేదు. నాగార్జున అయితే వంద కోట్ల బొమ్మను చూసింది లేదు. అలా ఈ నలుగురిలో వెంకీ మామ ఇప్పుడు టాప్ పొజిషన్‌కు వెళ్లాడు.