https://oktelugu.com/

Diwali 2024: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఏ రోజు జరుపుకుంటారో తెలుసా?

ఏటా దీపావళి పండుగ అనగానే ఏరోజు జరుపుకోవాలనే సందిగ్ధం నెలకొంటుంది. అమావాస్య ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో ఒక రోజు, మరికొన్ని ప్రాంతాల్లో మరోలా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అదే సందిగ్ధం నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 / 10:01 AM IST

    Diwali 2024(1)

    Follow us on

    Diwali 2024: దీపావళి అనగానే దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఉత్సాహం నెలకొంటుంది. అన్ని వర్గాలు పండుగ కోసం ఎదురు చూస్తుంటాయి. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా దీపావళిని జరుపుకుంటారు. అయితే ఏటా దీపావళి జరుపుకోవడంపై సందిగ్ధం నెలకొంటుంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు వేర్వేరు రోజులు దీపావళి సెలవులు ప్రనకటించాయి. అయితే ఈసారి దీపావళిని అక్టోబర 31న జరుపుకోవాలని కొందరు, నవంబర్‌ 1న జరుపుకోవాలని మరికొందరు చూసిస్తున్నారు. దీంతో గందగరోళం నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులు ప్రకటించారో తెలుసుకుందాం.

    – ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 31న దీపావళి సెలవు ప్రకటించింది. నవంబర్‌ 2న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్‌ 3న భాయ్‌ దూజ్‌ పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈరోజు కూడా సెలవు ప్రకటించింది.

    – మహారాష్ట్రలో సాధారణంగా దీపావళి రెండు రోజులు జరుపుకుంటారు. సెలవు కూడా రెండు రోజులు ఉంటుంది. నవంబర్‌ 1, 2 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీపావళికి ముందు, తర్వాత పాఠశాలలకు ఏడు నుంచి 10 రోజుల వరకూ సెలవులు ఉండే అవకాశం ఉంది.

    – ఢిల్లీలో నవంబర్‌ 1న దీపావళి జరుపుకోవాలనిప్రభుత్వం నిర్ణయించింది. పండుగను కుటుంబం మొత్తం జరుపుకులా అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

    – ఇక తమిళనాడులో ఈసారి దీపావళిని అక్టోబర్‌ 31న జరుపుకోవాలని ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    – గుజరాత్‌లో కూడా అక్టోబర్‌ 31నే దీపావళి జరుపుకోనున్నారు. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 2 వరకు సెలవులు ప్రకటించింది.

    – పశ్చిమ బెంగాల్‌లో కాళీ పూజ, దీపావళి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 1, 2 తేదీల్లో దీపావళి సెలవు ప్రకటించింది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్‌ 31న కూడా సెలవు ప్రకటించింది.

    – మధ్యప్రదేశ్‌లో దీపావళిని రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నవంబర్‌ 1, 2 తేదీల్లో సెలవులు ఇచ్చారు.

    – బిహార్‌లో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్‌ 1, 2 తేదీల్లో సెలవులు ఉంటాయి. దీనితోపాటు ఛత్‌ పూజకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

    – రాజస్తాన్‌లో ఈ ఏడాది మూడు రోజులు దీపావళి సెలవులు ప్రకటించింది అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 2 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.

    – ఇక కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్‌ 1, 2 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.

    – కేరళలో దీపావళి సెలవును నవంబర్‌ 1న ప్రభుత్వం ప్రకటించింది.