spot_img
Homeఆధ్యాత్మికంGoddess Lakshmi: ఈ చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకోవడం వలన కోటీశ్వరులు అవచ్చు...ఆ...

Goddess Lakshmi: ఈ చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకోవడం వలన కోటీశ్వరులు అవచ్చు…ఆ పరిహారాలు ఇవే..

Goddess Lakshmi: మనిషి జీవితం లో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది.చేతి లో డబ్బు లేకపోతే ఏ పని కూడా పూర్తి అవ్వదు.అలాంటి డబ్బు సంపాదించటానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.అయితే కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా కూడా వారి ఇంట్లో డబ్బు నిలవదు.చాలా మంది ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.లక్ష్మి దేవి ఉంటేనే దేవతలా ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అందరు అంటూ ఉంటారు.అలాంటి లక్ష్మి దేవి నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలి.ఏం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలువ ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే డబ్బు ఇంట్లో నిలుస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలుస్తుంది.అలా బిర్యానీ ఆకు తో పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గది లో ఉన్న లక్ష్మి దేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి ఆ ఇల్లాలు పూజ చేయాలి.అయితే ఆ బిర్యానీ ఆకు వంటింట్లో ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొన్నదై ఉండాలి.ఇలా పూజ చేసిన బిర్యానీ ఆకును జేబు లో లేదా పర్సు లో ఉంచుకున్నట్లయితే లక్ష్మి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు.చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొంటారు కానీ వాళ్లకు ఇల్లుకట్టునే అంత డబ్బు చేతిలో ఉండదు.

అలా తాము కొన్న స్థలం లో ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచించేవారు శుక్రవారం రోజున మట్టి తో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి.ఇలా ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచటం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఇలా చేయడం వలన తాము కొన్న స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి ధనం చేకూరుతుంది.కొంత మంది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు.అలా ఇంట్లోకి రావడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.ఇంట్లో అనారోగ్య సమస్యలు,ఆర్ధిక సమస్యలు చుట్టూ ముడతాయి.అందుకని ప్రతి ఒక్కరికి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అని చెప్పాలి.అలాగే ఇంట్లో తులసి మొక్కను పూజించడం వలన కూడా లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.సాక్షాత్తు లక్ష్మి దేవి తులసి మొక్కలో నివసిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.

అలాంటి తులసి ఆకులను అయిదు తీసుకోని ఎర్రటి గుడ్డలో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన ఆర్ధిక సమస్యలు అన్ని తొలగిపోయి ఇంట్లో డబ్బు నిలుస్తుంది.వచ్చే ఆదాయానికి మించి మీరు డబ్బు ఖర్చు చేస్తున్నాము అని మీకు అనిపించినట్లయితే మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి.ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన ఆర్ధిక సమస్యలు రావు.అలాగే నర దిష్టి కూడా మీకు తగలదు.అయితే మహిళలు ఎడమ కాలికి మరియు పురుషులు కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు.ప్రతి రోజు పూజ చేయడం కుదరకపోయిన సోమవారం రోజున పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులు కలుగుతాయి అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.దేవతలందరు ఆరాధించే శివుడికి సోమవారం అంటే ఇష్టం కాబట్టి ఆ రోజున పూజ చేసే దేవతలందరి ఆశీర్వాదం కలుగుతుంది.కొంత మందికి ఇంట్లో మంచం పైన భోజనం చేసే అలవాటు ఉంటుంది.ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కరిగిపోయి ఆర్ధిక సమస్యల బారిన పడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper