https://oktelugu.com/

Puri Musings: పూరి మ్యూజింగ్స్ లో చెప్పిన మాటలకు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు.. పూరి అంటే అలా ఉంటది మరి….

ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేసి సక్సెస్ లను సాధించండి అంతే తప్ప ఏదో జరిగింది ఏదో జరుగుతుంది అనే అపోహలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోయిన వారు అవుతారు. అలాగే మీ గోల్స్ ని కూడా చెర లేని స్థితిలోకి మీరు వెళ్లిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 30, 2024 / 06:26 PM IST

    Puri Musings

    Follow us on

    Puri Musings: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ్ తన సినిమాలతోనే కాకుండా తన మాటలతో కూడా ప్రేక్షకుల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటాడు. తను కూడా కొద్ది సంవత్సరాల నుంచి పూరి మ్యూజింగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంచి మాటలు చెబుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను తన అభిమానుల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనే రీసెంట్ గా ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు.

    ఇక అందులో ఏముంది అంటే “ఏదైనా సాధించాలి అంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన బిజినెస్ లో లాస్ అయినంత మాత్రాన కెరియర్ అనేది ముగిసిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం… మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో అప్పుడే పనిచేస్తూ బిజీ అయిపోవాలి. అలాంటి సమయంలో ఖాళీగా ఉన్న కొద్ది ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది. మనల్ని మనం గెలవాలి అంటే ముందు మన ఆలోచనలను గెలవాలి. ఎప్పుడైతే మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో అప్పుడు మాత్రమే గెలుపు అనేది తద్యమవుతుంది. చివరి ఊపిరి ఉన్నంతవరకు మనం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ఆలోచనలు చాలా పాజిటివ్ గా ఉంటాయి.

    అందుకే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేసి సక్సెస్ లను సాధించండి అంతే తప్ప ఏదో జరిగింది ఏదో జరుగుతుంది అనే అపోహలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోయిన వారు అవుతారు. అలాగే మీ గోల్స్ ని కూడా చెర లేని స్థితిలోకి మీరు వెళ్లిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.

    అందువల్లే నీలో సత్తువ తెగింపు ఉన్నంత వరకు నువ్వు పోరాడు” అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడున్న యూత్ లో చాలా ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి…నిజానికి పూరి చెప్పే మాటలు అభిమానులను చాలా మోటివేట్ చేస్తూనే ఆలోచించే విధంగా ఉంటాయి…ఆయన ఎప్పుడు మాట్లాడిన కూడా ఆయన మాటల్లో ఒక నిగూఢమైన అర్థం అయితే దాగి ఉంటుంది. దాని అర్థం చేసుకొని ఆచరిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ అనేది ఉంటుంది…