https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఈరోజు మహా శివుడి ఆశీస్సులు.. ఆ పనులన్నీ పూర్తి చేస్తారు…

Today Horoscope In Telugu పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. పాత స్నేహితులు కలుస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాహనాలకు నువ్వులు చేయాలని అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2025 / 08:02 AM IST
    Horoscope Today

    Horoscope Today

    Follow us on

    Today Horoscope In Telugu: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో బ్రహ్మయోగం ఏర్పడడంతో పాటు శుక్రుడు మీనరాశిలో ప్రయాణం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఆకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలకు కొందరు శత్రువులు ఇబ్బంది పెడతారు. కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో మానసికంగా అందరితో ఉంటారు. దూరపు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. పాత స్నేహితులు కలుస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాహనాలకు నువ్వులు చేయాలని అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. జాతులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం కావడంతో వారితో ఉల్లాసంగా ఉంటారు. అయితే అప్పుడే వారితో ఆర్థిక కార్యకలాపాలు జరపొద్దు. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పదోన్నతులు పొందేందుకు అవకాశాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కొన్ని రోజులు సమయం తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కాస్త నష్టాలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్ పలను పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. జాతిలో పోటీ పరీక్షలో పాల్గొంటే మద్దతు ఇవ్వాలి. ఎంతో శుభకార్యాల కోసం బిజీగా మారుతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు అనుకోకుండా ఆదాయాన్ని పొందగలుగుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ పనిలో పూర్తికావడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుస్తారు. వాహనాలపై ప్రయోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొత్తగా పెట్టుబడును పెట్టేవారు సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకొని లాభాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో కొంత రుణం తీరుస్తారు. తల్లిదండ్రుల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారం చేసే వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఎలాంటి కష్టం ఎదురైనా ఓట్లు ధైర్యంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే అనుకున్న పనిని పూర్తిగా సాధిస్తారు. సోదరుల మద్దతుతో ఇంట్లోని కొన్ని వ్యవహారాలను చక్కబెడతారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : సోదరీ వివాహం కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకొని అదృష్టం వల్ల ధనం వచ్చి చేరుతుంది. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే వెంటనే చెల్లిస్తారు. ఈరోజు వ్యాపారాలు కొత్త ఒప్పందాలను తీసుకోవద్దు. లేకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దలను సంప్రదించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రణాళికల ద్వారా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.