Mohan Babu and Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్టార్ స్టేటస్ అయితే దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న కథలు గానీ, వాళ్లని స్క్రీన్ మీద దర్శకులు చూపించిన విధానం అన్ని ప్రేక్షకులకు నచ్చినప్పుడే మూవీ సక్సెస్ అవుతుంది. తద్వారా వాళ్ళకి కూడా స్టార్ స్టేటస్ వస్తుంది…ఇప్పుడు అలాంటి హీరోలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి ఉన్న గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తనతో పాటు తన సమకాలీన హీరోలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నప్పటికి ఆయన ఎప్పటికప్పుడు తన రేంజ్ హిట్స్ మాత్రం సాధిస్తూ వేరే హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీ హిట్లను కొడుతూ స్టార్ గా మారాడు… ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు(Mohan Babu) సైతం విలన్ గా నటిస్తూనే, హీరో గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికి, ఆయన స్టార్ హీరో రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. కారణం ఏదైనా కూడా మోహన్ బాబు చేసిన సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ ఒకేసారి కెరీర్ ని స్టార్ట్ చేయడం వల్ల మోహన్ బాబుని బీట్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా ఎదగడంతో మోహన్ బాబు కొంతవరకు అది జీర్ణించుకోలేకపోయాడనే విషయాన్ని చాలా సందర్భాల్లో చాలామంది సినిమా మేధావులు సైతం తెలియజేశారు.
ఇక అందువల్లే చిరంజీవి మీద కొన్ని సెటైర్లు వేస్తూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే మోహన్ బాబు మంచి నటుడే అయినప్పటికి టాప్ రేంజ్ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు అంటే ఆయన ఎంచుకున్న కథలు అపుడున్న ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
Also Read : చిరంజీవి చేస్తున్న విశ్వంభర మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్న మోహన్ బాబు…
ఆయన చేసే సినిమాల మీద ప్రేక్షకుల్లో కొంతవరకు బజ్ ఉన్నప్పటికీ భారీ రేంజ్ లో ఓపెనింగ్ రాబట్టే సినిమాలను చేయలేకపోవడం వల్ల ఆయన క్రేజ్ స్టార్ రేంజ్ లో ముందుకు సాగలేక పోయింది. ఇక అంతకుమించి ఆయన దర్శకుల మీద కోపానికి రావడం క్రమశిక్షణ అంటూ అందరిని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూడడం ఇవన్నింటితో విసిగిపోయిన చాలామంది దర్శకులు ఆయనతో సినిమా చేయాలంటే భయపడే స్టేజికి వెళ్లిపోయారు.
అందువల్లే ఆయనతో స్టార్ డైరెక్టర్ ఎవరు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. దీని వల్లే ఆయన చిరంజీవి రేంజ్ లో సక్సెస్ అయితే కాలేకపోయారనేది వాస్తవం. మరి ఏది ఏమైనా కూడా మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం హీరోగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం…
Also Read : ‘మోహన్ బాబు – చిరు’ ఫోన్ కాల్.. నాగబాబు రియాక్షన్ ఏమిటో ?