Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక కొంతమంది మాత్రం పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాను చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటితో భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంటున్న నేపధ్యంలో ఇప్పుడు చేస్తున్న ‘కన్నప్ప’ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సంవత్సరం రాజాసాబ్ (Rajasaab) సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే దానిమీద సరైన క్లారిటీ లేదు కానీ ఈ సంవత్సరంలో మాత్రం తప్పకుండా రిలీజ్ అవుతుందనే విషయంలో ప్రభాస్ క్లారిటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఫౌజీ (Fouji) సినిమాతో ఆయన భారీ రేంజ్ లో తన సత్తాను చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే హను రాఘవపూడి (Hanu Raghavapudi) చెప్పినట్టుగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
Also Read : అసలు ప్రభాస్ చేయాల్సిన కన్నప్ప మూవీ విష్ణు చేతిలోకి ఎలా వెళ్ళింది? పెదనాన్న కృష్ణంరాజు కోరిక ఎందుకు తీరలేదు?
ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు (Vishnu) హీరోగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప (Kannappa) సినిమాలో ప్రభాస్ రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో ప్రభాస్ కనిపించిన ఒక్క షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. టీజర్ లక్షల్లో వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వల్ల సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా కోసం ఎదురుచూసే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రభాస్ పుణ్యమాని ఈ సినిమా మీద మంచు విష్ణు భారీ బిజినెస్ ని కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇతర భాషల నుంచి ఈ సినిమా రైట్స్ ని తీసుకోవడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మంచు విష్ణు ఈ సినిమాతో భారీ బిజినెస్ జరపడమే కాకుండా సినిమాని సక్సెస్ చేసి తీరాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశమైతే ఉంది. కేవలం ప్రభాస్ వల్లే ఈ సినిమా భారీ బజ్ ను క్రియేట్ చేసుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : ‘కన్నప్ప’ లో అక్షయ్ కుమార్ ని ఒప్పించడానికి మంచు విష్ణు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా..పాపం చుక్కలు చూపించాడుగా!