Today Horoscope In Telugu(1)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం సుకర్మయోగం కారణంగా కొన్ని రాశులవారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : చట్టపరమైన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. కొన్ని నిర్ణయాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్ర్తత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వెంటనే పొందుతారు. ఏ పని మొదలు పెట్టినా అంకితభావంతో పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థిక వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బులను ఖర్చు చేస్తారు. అర్హులైన వారికి వివాహా ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితుల్లో ఒకరికి ధన సాయం చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో ఆహ్లాదరకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులు ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఖర్చులను నియంత్రించాలి. లేకుంటే భవిష్యత్ లో ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. పని భారం కారణంగా జీవత భాగస్వామితో కలిసి ఉండలేరు. చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగులకు పనిలో అడ్డంకులు ఏర్పడుతాయి. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఎవరితోనైనా వాగ్వాదానికి దిగితే తొందరపడొద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారుల పనులకు ఆటంకాలు సృష్టిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే వెంటనే తిరిగి వస్తుంది.