Benjamin Netanyahu Death Rumors: ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతాన్యాహు చనిపోయారు.. ఇటీవల జరిగిన దాడులలో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ అత్యంత రహస్యంగా ఉంచుతున్నది. ప్రత్యామ్నాయ నాయకుడిని ఎన్నుకుంటున్నది.. ఇజ్రాయిల్ పని అయిపోయినట్టే.. కొంతకాలంగా ఇరాన్ మీడియా చేస్తున్న ప్రచారం ఇది.
Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!
ఇరాన్, ఇతర మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయిల్ తిప్పికొట్టింది. ఒక కీలకమైన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నెతాన్యాహు ఒక కాఫీ షాప్ లో కనిపించారు. అక్కడ ఆయనకు తనకు ఇష్టమైన కాఫీ తాగారు. ఆ తర్వాత చేతి వేళ్లను చూపించారు. నాకు ఎంతో ఇష్టమైన కాఫీ తాగడానికి ఇక్కడికి వచ్చాను. కాఫీ తాగడం అంటే నాకు చాలా ఆసక్తి. ఈ కాఫీ తాగడం అంటే నాకు చచ్చేంత ఇష్టం. దేశం కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తానని.. నెతాన్యాహు ఆ వీడియోలో మాట్లాడారు.
నెతాన్యాహు చనిపోయినట్టు.. ఇరాన్ మీడియా ప్రచారం చేస్తోంది. దీనికి తోడు ఫేక్ వీడియోలతో ఇజ్రాయిల్ ప్రపంచాన్ని మోసం చేస్తుందని ఆలోచించింది. డీప్ ఫేక్ వీడియో కాబట్టి నెతాన్యాహు కు చేతికి 6 వేళ్ళు ఉన్నాయని ఇరాన్ మీడియా ఆరోపించింది. అయితే కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ నెతాన్యాహు కనిపించిన వీడియోలో ఆయన చేతికి 5 వేళ్ళు మాత్రమే ఉన్నాయి. పైగా ఆ చేతిని నెతాన్యాహు పదేపదే చూపించారు. దీంతో నెతాన్యాహు చనిపోలేదని.. ఆయన బతికే ఉన్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇజ్రాయిల్ ఇటీవల ఇరాన్ మీద భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ అనుబంధ గ్రూపులను కూడా నాశనం చేస్తోంది. భారీగా ఖర్చు పెడుతున్నప్పటికీ ఇజ్రాయిల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా దాడులను తీవ్రతరం చేస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ ని అంతం చేయడంలో ఇజ్రాయిల్ కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఇజ్రాయిల్ అనేక రకాలుగా దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ దేశం కీలక ఆయువు పట్టువుల మీద దెబ్బకొడుతూనే ఉంది. ఆర్థికంగానే కాకుండా.. ఆస్తులపరంగా కూడా తీవ్రంగా నష్టం చేకూర్చుతూ ఇరాన్ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.