Maha Kumbh Mela 2025: ప్రస్తుతం మహా కుంభమేళా (Maha Kumbh Mela) జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళానికి (Maha Kumbh Mela) వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో (Prayag Raj) ఈ మహా కుంభమేళా (Maha Kumbh Mela) జరుగుతోంది. ఇందులో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు అన్ని తొలగిపోయి.. మోక్షం లభిస్తుందని నమ్ముతారు. జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా (Maha Kumbh Mela) జరుగుతోంది. అయితే ఇటీవల మొదటి అమృత స్నానం జరిగింది. ఈ అమృత స్నానానికి ఎందరో భక్తులు, నాగ సాధువులు, అఘోరాలు వచ్చారు. ఇప్పటికే దాదాపుగా కోట్లాది మంది భక్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా రోజులతో పోలిస్తే అమృత స్నానం చేయడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే మహాకుంభ రెండవ అమృత స్నాన్ జనవరి 29న జరగనుంది. దీంతో మూడు గ్రహాల శుభ కలయిక వల్ల కొన్ని రాశులను అద్భుత యోగం పట్టనుంది. అమృత స్నానం సమయంలో మకరరాశిలో సూర్యుడు-చంద్రుడు, బుధుడు కలయిక ఏర్పడతాయి. వీటివల్ల అదృష్టం పట్టబోతున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
మేషరాశి
మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం చేయడం వల్ల మేష రాశి వారికి మేలు జరగనుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, బుధుడు ఉండటం వల్ల కెరీర్ రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. పెట్టిన డబ్బు మూడు రెట్లు వస్తుంది. డబ్బును ఆదా చేస్తారు. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.
కన్యా రాశి
సూర్యచంద్రులు, బుధుడు కలయిక వల్ల కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంది. విద్యా రంగంలో గొప్ప విజయాలు సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్‌లో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అన్ని విధాలుగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశి వారు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా కూడా లాభాలను పొందుతారు. అనుకున్న పనులు అన్ని కూడా నెరవేరుతాయి. కష్టాలు, బాధలు అన్ని కూడా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి రెండవ అమృత స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఎలాంటి సమస్యలు అయిన కూడా తీరుతాయి. సామాజంలో కీర్తీ పెరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి విద్యారంగంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులు అన్ని కూడా నెరవేరుతాయి. వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు పొందుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.