Coromandel Express Accident
Coromandel Express Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ కేవలం బోగీలు పట్టాలు తప్పడం వల్లే వాటి కింద పడి ప్రయాణికులు చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు విచారణ నిర్వహిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి..ఈ ప్రమాదంలో 40 మంది విద్యుత్ షాక్ తో మరణించినట్లు తెలుస్తోంది.. అంతే కాదు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంటుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. జూన్ 2 న జరిగిన ఈ ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ తోనే చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించిన పోలీస్ అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది…బోగీ ల నుంచి మృతదేహాలను బయటికి తీశారు.
ఒక బోగీ నుంచి..
ఒక బోగీ నుంచి 40 మృతదేహాలను బయటకు తీశారు. వాటి పై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్ళు కనిపించలేదు. ఇదే విషయాన్ని పోలీసులు తమ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీల మీద పడిందని, దీంతో విద్యుత్ షాక్ సంభవించిందని ఆగ్నేయ రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలు ను ఢీ కొట్టిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు – హౌరా ఎక్స్ ప్రెస్ కు కోరమాండల్ బోగీలు ఢీ కొట్టడంతో ఆ రైలు వెనుక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లైన్ కరెంటు వైర్లు తెగి బోగీ లపై పడ్డాయి. దీంతో విద్యుత్ ప్రసారం జరిగి 40 మంది దాకా చనిపోయారని రైల్వే శాఖ వర్గాలు అంటున్నాయి. బోగీల మధ్య నలిగిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గాయాలు కాలేదు
ఆ బోగీలో మృతదేహాలను వెలికి తీస్తున్నప్పుడు ఎలాంటి గాయాలు కల్పించలేదని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. కనీసం రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించలేదని రైల్వే శాఖ వర్గాలు చెబుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. బోగీల పై లో టెన్షన్ వైర్లు పడి విద్యుత్ ప్రసరించడంతో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందని అధికారులు అంటున్నారు.
ఎక్కువ రోజులు ఉంచలేం
ఈ ప్రమాదంలో 278 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు వంద మృతదేహాలను అధికారులు గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది అధికారులు ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఇప్పటికే ప్రమాదం జరిగి 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించేంతవరకైనా ఎంబామ్ చేసి భద్రపరచాలని వైద్యాధికారులు భావిస్తున్నప్పటికీ.. దానివల్ల ఉపయోగముండకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో డిఎన్ఏ మ్యాచింగ్ కోసం రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన 12 గంటల లోపు ఎంబామింగ్ సరిగా చేస్తేనే మృతదేహాన్ని సంవత్సరాల తరబడి భద్రపరచవచ్చని ఆనాటమీ వైద్య నిపుణులు అంటున్నారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకపోతే శరీరాలు 12 గంటల వరకు బాగానే ఉంటాయని, ఐస్, కోల్డ్ స్టోరేజ్ మృతదేహాన్ని కుళ్ళిపోడాన్ని ఆలస్యం చేస్తుందని వివరిస్తున్నారు.
తల ఎగిరి ఛాతి మీద పడింది
ఇక ఈ ఒడిశా రైలు ప్రమాదంలో రూపక్ దాస్ అనే అస్సాం యువకుడు చెబుతున్న మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ రైలులో ఆ యువకుడు ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదం జరగడంతో అతడు షాక్ లోకి వెళ్లిపోయాడు. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ గ్లాస్ పగలగొట్టి బయటకు దూకేశాడు. ఇప్పుడే యశ్వంతపూర్ రైలు వచ్చి ఇతడు ప్రయాణిస్తున్న బోగిని బలంగా ఢీకొట్టింది. ఆ బోగిలోని ఓ వ్యక్తి తల ఫుట్బాల్ మాదిరి ఎగిరి వచ్చి రూపక్ దాస్ చాతి మీద పడింది. ప్రస్తుతం ఇతడికి వైద్యాధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shocking facts about the coromandel express accident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com