Mahesh Babu Keerthy Suresh Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata: సినిమా రంగం అంటేనే హిట్ అనే అదృష్టం చుట్టూ తిరుగుతుంది. వందల కోట్లతో ఆడే జూదం లాంటిది సినిమారంగం. అందుకే కలిసివచ్చిన సెంటిమెంట్ ను పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఒక సినిమా కొన్ని సెంటిమెంట్ ల కారణంగా హిట్ అయిందంటే ఆ సెంటిమెంట్లను తర్వాత సినిమాలకు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు మన టాలీవుడ్ హీరోలు.
Sarkaru Vaari Paata
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇలాంటి సెంటిమెంట్లను బలంగా నమ్ముతుంటారు. గతంలో కూడా చాలా సినిమాల విషయంలో ఆయన ఇలాగే సెంటిమెంట్లను ఫాలో అయ్యారు. కాగా ప్రస్తుతం సర్కారువారి పాట ఈ విషయంలో ఓ బాడ్ సెంటిమెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. అదే మే నెల సెంటిమెంట్. పరశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట మే 12న రిలీజ్ కాబోతోంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి నోట మాట రాని డిస్ట్రిబ్యూటర్స్?
గతంలో మహేష్ బాబు నటించిన చాలా సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ప్రస్తుతం సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరుగుతుందా అనే టెన్షన్ మొదలైంది. 2003లో మహేష్ నటించిన నాని మూవీ మే 14న రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. 2004లో మే 23న వచ్చిన నిజం మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. నిజం మూవీ మహేష్ కు నంది అవార్డు తీసుకొచ్చినా.. అభిమానులను మాత్రం మెప్పించలేకపోయింది.
Sarkaru Vaari Paata
ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన బ్రహ్మోత్సవం 2020 మే 16న రిలీజ్ అయి అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది చాలా పెద్ద ప్లాప్. కాగా ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. వంశీ పైడిపల్లి తీసిన మహర్షి మూవీ.. 2019 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 100 కోట్ల వసూళ్లతో దుమ్ము రేపింది. కాబట్టి మరోసారి ఆ ఫార్ములా సర్కారు వారి పాటకు వర్కౌట్ అవుతుందనే నమ్మకంతోనే మే నెలలో రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. మరి మహేష్ బాబు బ్యాడ్ సెంటిమెంట్ ను సర్కారు వారి పాట కంటిన్యూ చేస్తుందా లేక బ్రేక్ చేస్తుందా అనేది వేచి చూడాలి.
Also Read: వాళ్ళు నన్ను ఏదేదో అనేవాళ్లు – రాశీ ఖన్నా
Recommended Video:
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Sarkaru vaari paata movie new update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com