Renu Desai : రేణు దేశాయ్ సోషల్ మీడియాలో నిత్యం తన పిల్లల గురించి ఏదో ఒక విషయం షేర్ చేస్తూ ఉంటారు. అకీరా నందన్, ఆద్యల టాలెంట్ పరిచయం చేస్తుంటారు. రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్టులు తరచుగా వైరల్ గా మారుతున్నాయి. రేణు దేశాయ్ తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఒకటి ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలు బెంగళూరులో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో అకీరా, ఆద్యలు కూడా పాల్గొన్నారు.
ఈ మెగా సంక్రాంతి సంబరాల్లో అకీరా, ఆద్యలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అకీరా పియానో వాయించి అందరిని మెస్మరైజ్ చేశాడు. నెటిజన్స్ ప్రశంసలు పొందాడు. ఇక ఆద్య కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. దీంతో తన పిల్లల ప్రతిభ .. ఎదుగుదల చూసి రేణు దేశాయ్ మురిసిపోతుంది. ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ‘వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా .. లేదంటే వాళ్ళు నాకు తిరిగి పునర్జన్మను ఇచ్చారా అన్నది అర్థం కావడం లేదు. నా పిల్లలను చూసి ఒక్కో సారి నేను ఆశ్చర్యపోతుంటాను’ అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యింది.
అలాగే రేణు దేశాయ్ ఆద్యలో ఉన్న ఓ స్పెషల్ టాలెంట్ ను బయట పెట్టారు. వీడియోలో ఆద్య కరాటే, కుంగ్ఫూ చేస్తూ కనిపించింది. ఆ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్ సరదాగా వార్నింగ్ ఇచ్చారు.’ నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే .. నా పర్సనల్ సెక్యూరిటీ తో మీకు కష్టాలు తప్పవు జాగ్రత్త’ అని కామెంట్ రాసి ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
త్వరలో అకీరా నందన్ సినీరంగ ప్రవేశం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్ సుమారు రెండు దశాబ్దాల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రలో హుందాగా నటించి ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా కేరళ కు వెకేషన్ కి వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ .. మూగ జీవాలతో సమయం గడిపారు. రేణుదేశాయ్ త్వరలో ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Web Title: Renu desais video introducing her body guard has gone viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com