Kannappa : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఇక వాళ్లతో సినిమాలు చేస్తేనే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి. ఒకవేళ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసినప్పటికి అవి భారీ సక్సెస్ ను సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి. ఇక పెద్ద హీరోకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ రేంజ్ కి తగ్గ సక్సెస్ ని అందుకుంటుంటారు. అందుకే ఒక కథని స్టార్ హీరో తో చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు…
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరో ఇప్పటికే పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (fouji) సినిమా సెట్స్ లో సందడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ చాలా తక్కువ సమయంలో రిలీజ్ చేయడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తున్నాడు. మంచు విష్ణు (Vishnu) 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప (Kannappa)సినిమాలో ప్రభాస్ (Prabhas) ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
మరి ఆ పోస్టర్ ను చూసిన చాలా మంది ప్రభాస్ ఈ లుక్ లో బాగున్నాడు అంటుంటే, మరి కొంత మంది మాత్రం ప్రభాస్ లుక్ ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఉండటం వల్ల సినిమాకి హైప్ రావడమే కాకుండా భారీ రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతుంది.
అయితే ఇక్కడి వరకు ప్రభాస్ వల్ల ప్లస్ జరిగితే మైనస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమాలో ప్రభాస్ చేసిన క్యారెక్టర్ సరిగ్గా లేకపోయిన దాన్ని దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేకపోయినా కూడా సినిమా మీద భారీగా నెగెటివ్ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. తద్వారా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానంగాని ఆయన సినిమాలో పెర్ఫామ్ చేసిన పద్ధతి గాని ప్రతి ఒక్కటి ఫెయిర్ గా ఉండాలి.
లేకపోతే మాత్రం సినిమా మీద భారీగా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…