
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్ లో అడుగుపెట్టారు. అయితే ఆయన పర్యటనను ఆటంకపరచాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ పర్యటనకు ప్రజలను దూరంగా ఉంచి తన పంతం నెగ్గించుకోవాలని పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది.
“భారత్, కరోనా వైరస్ ని దాచిపెడుతుంది” (“#india hiding corona virus”) అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు పాకిస్తాన్ ట్విటర్ లో టాప్ ట్రెండ్‌లో ఉంది. #TrumpinIndia అనేది దాని తర్వాత స్థానంలో ఉండటం విశేషం.
“కరోనాకు ప్రభావితమైనవారిని హిందూయేతర ప్రాంతాల్లో ఉంచుతున్నారు” అని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి ద్వారా, అమెరికా అధ్యక్షుడి పర్యటనను కనీసం సోషల్ మీడియాలో అయినా కరోనా వైరస్‌తో దెబ్బ కొట్టాలని పాకిస్తాన్‌లోని కొంతమంది చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక యూజర్, ట్రంప్, ఇవాంక ఉన్న ఫొటోను పోస్ట్ చేసి “మఫ్లర్, మీసాలు ఉన్న ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే మీ హ్యాండ్ శానిటైజర్ సిద్ధంగా ఉంచుకోండి” అని రాశారు.
ట్రంప్ భారత పర్యటన గురించి మరో యూజర్ “మోదీ ఒక మాంసం తినే వ్యక్తిని ఆలింగనం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు” అన్నారు.
ఈ విధంగా విభిన్న రీతులలో ట్రంప్ పర్యటనను ఆటంకపరచడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది.
గతం లో కూడా అమెరికాలో భారత్ ప్రధాని మోడీ కోసం ఏర్పాటుచేసిన “హౌడి మోడీ” కారక్రమాన్ని భంగం చేయడానికి పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. నల్లని మాస్క్ లు కట్టుకొని అమెరికా వీధులలో నడుస్తూ వినూత్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.. మరలా ఇప్పుడు “నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఈ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది పాకిస్థాన్.