సారూ…ప్రజలేమైన పిచ్చోళ్లా..?

“అందర్నీ కొన్ని సార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్ని సార్లు మోసం చేయొచ్చు, కానీ అందర్నీ అన్ని సార్లు మోసం చేయడం కుదరదు” అన్నాడు ఓ మహానుభావుడు. ఇదే సూక్తి ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని సీఎం కేసీఆర్ ఇప్పటివరకు చేకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏపీతో పొల్చుంటే కరోనా కేసుల విషయంలో మనమే మెరుగ్గా ఉన్నామని కూడా చెబుతున్నారు. కానీ తాజాగా వెలువడిన రెండు వార్తలు […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 8:20 am
Follow us on

“అందర్నీ కొన్ని సార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్ని సార్లు మోసం చేయొచ్చు, కానీ అందర్నీ అన్ని సార్లు మోసం చేయడం కుదరదు” అన్నాడు ఓ మహానుభావుడు. ఇదే సూక్తి ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని సీఎం కేసీఆర్ ఇప్పటివరకు చేకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏపీతో పొల్చుంటే కరోనా కేసుల విషయంలో మనమే మెరుగ్గా ఉన్నామని కూడా చెబుతున్నారు. కానీ తాజాగా వెలువడిన రెండు వార్తలు తెలంగాణ సర్కార్ డొల్ల తనాన్ని బయట పెట్టాయి.

తెలంగాణ లో నిన్న ఒక్క రోజే కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం కలవర పెడుతుంది. కోవిద్ కేసులు సింగిల్ డిజిట్ కి పడిపోయాయని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ కి ఇది చెంప పెట్టుగా మారింది. అదేసమయంలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులే నమోదు కావడం విశేషం.

“మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు” కరోనా టెస్టుల విషయంలో మరో సంచలన వార్త వెలువడింది. ఇప్పటివరకు తెలంగాణలో 23,388 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1551కి చేరుకుంది. అంటే ప్రతి 16 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే రాష్ట్రంలో 2,01,196 కరోనా టెస్టులు చేయడం విశేషం. మొత్తం కేసుల సంఖ్య 2,380 అంటే ప్రతి 94మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసులు మా రాష్ట్రంలో తక్కువ అని చెప్పుకునే కేసీఆర్, టెస్టులు తక్కువుగా చేయడం వల్ల ప్రమాదం అనే విషయం ఎందుకు అర్థంకావడం లేదో తెలియడం లేదు. టెస్టుల విషయంలో ఆజాగ్రత్త వహిస్తే కరోనా వ్యాప్తి మూడో స్టేజికి వెళ్లే ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరికను కేసీఆర్ ఎందుకు పెడచెవిన పెడుతున్నారో అర్థంకావడం లేదు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు సడలింపులు ఇస్తున్న ప్రస్తుత సమయంలో టెస్టులు ఎక్కువగా చేసి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు తెలంగాణ ప్రజలు ఇటలీ తరహాలో పెను విపత్తునే ఎదుర్కోవాల్సి వస్తుంది.