https://oktelugu.com/

ట్వీటర్లో కొత్త రికార్డు క్రియేట్ చేసిన తండ్రీకొడుకులు

మెగాస్టార్ చిరంజీవి కొన్నిరోజుల కిందటే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తన భావాలను అభిమానులతో పంచుకునేందుకు సరైన వేదిక కోసం సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ఉగాది రోజున ట్వీటర్లోకి ఎంట్రీకి అందరి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలోకి ఆయన ఎంట్రీని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గతంతోనే ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతో అభిమానులతో […]

Written By: , Updated On : May 17, 2020 / 09:14 PM IST
Follow us on


మెగాస్టార్ చిరంజీవి కొన్నిరోజుల కిందటే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తన భావాలను అభిమానులతో పంచుకునేందుకు సరైన వేదిక కోసం సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ఉగాది రోజున ట్వీటర్లోకి ఎంట్రీకి అందరి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలోకి ఆయన ఎంట్రీని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గతంతోనే ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతో అభిమానులతో టచ్లో ఉన్నారు. అయితే చిరు ట్వీటర్లో ఎంట్రీ ఇవ్వగానే తండ్రిని ఫాలోవుతూ రాంచరణ్ కూడా ట్వీటర్ అకౌంట్ ఓపెన్ చేశారు. దాదాపుగా వీరిద్దరు ట్వీటర్లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా వీరిద్దరు ఒకేసారి 5లక్షల ఫాలోవర్స్ ను క్రాస్ చేశారు.

ట్వీటర్లో ఒకేసారి 5లక్షల ఫాలోవర్స్ దాటేసిన తండ్రికొడుకులుగా సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరు ఒకేసారి ఈ ఫీట్ సాధించడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాక అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను ట్వీటర్లో పోస్టు చేస్తున్నారు. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న పలు సంఘటనలపై స్పందిస్తున్నారు. అదేవిధంగా తన శ్రేయోభిలాషులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక రాంచరణ్ కూడా ట్వీటర్లో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. రాంచరణ్ సినిమాలు చేస్తూనే నిర్మాతగా రాణిస్తున్నాడు. ఓవైపు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తూనే తన తండ్రితో ‘ఆచార్య’ మూవీ నిర్మిస్తున్నాడు. ‘ఆచార్య’లో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. రాంచరణ్ పక్కన నటించే హీరోయిన్ విషయంలో పలు పేర్లు విన్పిస్తున్నాయి. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ ఈ లిస్టులో ముందంజలో ఉంది. ఇక ఒకేసారి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ మున్మందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కన్పిస్తుంది.