Site icon OkTelugu

India stop buying oil from Russia: రష్యా ఆయిల్‌ దిగుమతిని భారీగా తగ్గించిన భారత్.. ట్రంప్ ఒత్తిడే కారణమా?

India stop buying oil from Russia

India stop buying oil from Russia

India stop buying oil from Russia: భారత్‌–అమెరికా మధ్య ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దానికి ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై విధించిన 50% టారిఫ్‌లను 18%కి తగ్గించారు. వాణిజ్య ఒప్పందం తర్వాత ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌ రష్యా ఆయిల్‌ కొనుగోలు తగ్గించి అమెరికా, వెనెజువెలా నుంచి కొంటుందని ప్రకటించారు. దీనిపై భారత్‌ అధికారికంగా స్పందించకపోయినా, గణాంకాలు మార్పును నిర్ధారిస్తున్నాయి. పుతిన్‌ దీన్ని భారత నిర్ణయంగా గుర్తించారు.

తగ్గిన దిగుమతి..
2025 డిసెంబర్‌లో రష్యా నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయిల్‌ దిగుమతి చేసుకుంది. నవంబర్‌లోని 3.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయిల్‌ కొనుగోలు చేసింది. అంటే నెల రోజుల్లో ఆయిల్‌ దిగుమతి 27% తగ్గించింది. మొత్తం భారత ఆయిల్‌ దిగుమతిలో రష్యా వాటా 34% నుంచి 24.9%కి పడిపోయింది. 2024 డిసెంబర్‌తో పోల్చితే 15% కొనుగోలు తగ్గింది. 38 నెలలుగా రష్యా నుంచి జరుగుతున్న కొనుగోలులు ఇదే తక్కువ.

పెరిగిన అమెరికా ఆయిల్‌ దిగుమతి..
అమెరికా నుంచి 2025 డిసెంబర్‌ దిగుమతులు 2024తో పోలిస్తే 31% పెరిగాయి. రష్యా నుంచి 15 శాతం తగ్గితే.. అమెరికా నుంచి దిగుమతి రెట్టింపైంది. వెనెజువెలా కూడా ప్రధానంగా చేరుతోంది. ఇది ట్రంప్‌ వాగ్దానాలకు సమానంగా ఉంది, కానీ ఆర్థిక లాభాలు ప్రశ్నార్థకం.

భారత్‌పై రవాణా భారం..
రష్యా ఆయిల్‌ రవాణా ఖర్చు అమెరికా ఆయిల్‌ షిప్పింగ్‌ చార్జీలతో పోలిస్తే సగం ఉంటుంది. రష్యా నుంచి మనం రూపాయిల్లో కొనుగోలు (పెట్రో–రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌) చేశాం. ఆ రూపాయలను కూడా రష్యా భారత్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. అమెరికా నుంచి డాలర్లలోనే లావాదేవీలు జరుపుతున్నాం. ఇక అమెరికా నుంచి రవాణాకు భారత్‌ బ్యారెల్‌కు 4 నుంచి 5 డాలర్లు అదనంగా చెల్లించాలి. వెనెజువెలా ఆయిల్‌ కొటే బ్యారెల్‌కు 10 డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రష్యా ఆయిల్‌ తక్కువగా వస్తున్నా.. అమెరికా ఒత్తిడి కారణంగానే మోదీ రష్యా ఆయిల్‌ తగ్గించి అమెరికా ఆయిల్‌ పెంచినట్లు చర్చ జరుగుతోంది.

ఆయుధ కొనుగోలుపైనా ప్రభావం..
ఆయిల్‌ తగ్గుదల అమెరికా ఒత్తిడికి సూచన. తదుపరి రష్యా ఆయుధాలపై ఆంక్షలు, అమెరికా సామగ్రిని కొనుగోలు డిమాండ్‌ రావచ్చు. ఇది భారత విదేశాంగ వ్యూహాన్ని పరీక్షిస్తుంది.స్వాతంత్య్ర నిర్ణయాలు ఆర్థిక ఒత్తిడికి గురవకూడదు.

రష్యా ఆధారం తగ్గడం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆత్మనిర్భర్‌ ఎనర్జీ, వైవిధ్యమైన మూలాలు అవసరం. అమెరికాకు పూర్తి తలొగ్గడం దీర్ఘకాలిక ప్రమాదం. సమతుల్య వాణిజ్యం, ఆర్థిక స్వాతంత్య్రం కీలకం.

Exit mobile version