spot_img
Homeజాతీయ వార్తలుధర్నా:.. నిన్న ముంబైలో నేడు హైద్రాబాద్ లో

ధర్నా:.. నిన్న ముంబైలో నేడు హైద్రాబాద్ లో

కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశ వ్యాప్తంగా అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. దింతో మొన్నటికి మొన్న ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించారు. తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ దాదాపు 1500 మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చి, గుమిగూడి ఆందోళన నిర్వహించారు. అదే సమయంలో హైద్రాబాద్ లో కూడా వలస కూలీలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అనేక వందల మంది వలస కూలీలు రోడ్లెక్కారు. తమను ఇంటికి పంపిచాల్సిందే అని ఆందోళనకు దిగారు.

ఐఐటీ హైదరాబాద్‌ భవనాల నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌ డౌన్‌ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే చిక్కుకు పోయారు. యజమాని సంగారెడ్డి కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు. గత నెలరోజులుగా ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అసహనానికి గురయ్యారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సత్వరమే అక్కడకు చేరుకుని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

కార్మికులు పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంస మయ్యాయి. రాళ్లు, కట్టెలు పట్టుకుని తిరుగుతూ.. బీభత్సం సృష్టించారు. ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని, కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version