బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి 11నే బండి సంజయ్ ను నియమిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈమేరకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకునే సమయంలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో కరోనా కారణంగా ఆ ర్యాలీని విరమించుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ముగిశాక పార్టీ బాధ్యతలను స్వీకరించాలని బండి సంజయ్ భావించారు. ఈక్రమంలోనే […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 4:03 pm
Follow us on


కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి 11నే బండి సంజయ్ ను నియమిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈమేరకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకునే సమయంలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో కరోనా కారణంగా ఆ ర్యాలీని విరమించుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ముగిశాక పార్టీ బాధ్యతలను స్వీకరించాలని బండి సంజయ్ భావించారు. ఈక్రమంలోనే ఆయన అనేకసార్లు పార్టీ కార్యాలయానికి పలుమార్లు వచ్చి వెళ్లారు. కాగా అధ్యక్షుడిగా పార్టీలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో ఈమేరకు బుధవారం బీజేపీ కార్యాయలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని తన ట్వీటర్లో తెలియజేశారు.

బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడి పదవీ బాధ్యతలు స్వీకరించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తన తరుపున, జనసేన నాయకులు, సైనికులందరి తరుపున మనః పూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ ట్వీట్ చేశారు. కాగా బండి సంజయ్ తొలిసారిగా కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమిపాలైన బండి సంజయ్ అనంతరం వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలుపొందారు. ఈ తరుణంలో తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక చేపట్టారు.

పార్టీ అధ్యక్షుడి రేసులో బండి సంజయ్ పేరు పెద్దగా విన్పించలేదు. అయితే బీజేపీ అధిష్టానం బండి సంజయ్ పై నమ్మకం ఉంచి తెలంగాణ అధ్యక్షుడి పదవీని కట్టబెట్టింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా పార్టీ కార్యాలయంలో సాదాసీదాగా బండి సంజయ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు లక్ష్మణ్‌, ధర్మపురి అర్వింద్‌, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.