చికెన్ ధరకి సమ్మర్ ఫార్ములా!

కరోనా వైరస్‌ కి చెక్ పెట్టాలంటే… ప్రోటీన్ ఉండే మాంసం తిని, ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకోవాలని అప్పుడెప్పుడో సీఎం కేసీఆర్ చెప్పడంతో… ఆ మాటను ప్రజలు సీరియస్‌ గా తీసుకున్నారు. క్రమం తప్పకుండా చికెన్ బాగా తిని అర్జంట్ గా ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకుంటున్నారు. ఐతే… దీన్ని అడ్డం పెట్టుకొని చికెన్ దుకాణాల వాళ్లు రేట్లు అమాంతం పెంచేశారు. కేజీ ఎంతంటే… ఏకంగా రూ.300 నుంచి రూ.310కి అమ్ముతున్నారు. దుకాణం దగ్గరకు వెళ్లాక… ప్రజలు జేబులు తడుముకోవాల్సి […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 11:35 am
Follow us on

కరోనా వైరస్‌ కి చెక్ పెట్టాలంటే… ప్రోటీన్ ఉండే మాంసం తిని, ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకోవాలని అప్పుడెప్పుడో సీఎం కేసీఆర్ చెప్పడంతో… ఆ మాటను ప్రజలు సీరియస్‌ గా తీసుకున్నారు. క్రమం తప్పకుండా చికెన్ బాగా తిని అర్జంట్ గా ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకుంటున్నారు. ఐతే… దీన్ని అడ్డం పెట్టుకొని చికెన్ దుకాణాల వాళ్లు రేట్లు అమాంతం పెంచేశారు. కేజీ ఎంతంటే… ఏకంగా రూ.300 నుంచి రూ.310కి అమ్ముతున్నారు. దుకాణం దగ్గరకు వెళ్లాక… ప్రజలు జేబులు తడుముకోవాల్సి వస్తోంది.

ఒక్కసారిగా ఎందుకు ఇంత రేటు పెంచారని అడిగితే… “ఏంచేస్తాం… ఎండాకాలం… కోళ్లు సరిగా మేత తినట్లేదు… నీరే తాగుతున్నాయి. అందువల్ల బరువు పెరగట్లేదు… దాంతో కోళ్లకు కొరత వచ్చింది, మాంసం రేటు పెరిగింది” అని సమ్మర్ ఫార్ములా చెబుతున్నారు.
వాళ్లు చెప్పినదాంట్లో కొంత నిజం ఉంది. అలాగని… కేజీ రూ.150 నుంచి రూ.180 ఉండే చికెన్ ధరను ఏకంగా రూ.300 దాకా పెంచేస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడంలో తప్పేముంది?

మామూలుగా తెలంగాణలో రోజుకు 7.5 లక్షల కేజీల నుంచి 8 లక్షల కేజీల కోడి మాంసం అమ్ముతారు. 24 లక్షల కేజీల దాకా అవుతుంది. లాక్‌ డౌన్‌ కు ముందు తెలంగాణలో నెలకు 4.20 కోట్ల కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 2.8 కోట్లకు తగ్గింది. దాంతో… కోళ్లకు కొరత వచ్చింది. అయితే కేజీ చికెన్‌ రూ.276కి మాత్రమే అమ్మాల్సి ఉండగా కొన్ని షాపుల్లో రూ. 300కు పైగా అమ్ముతున్నారు.