ఆర్థిక మంత్రి హరీష్ రావు లేదా వినోద్ కుమార్!

తెలంగాణ ఆర్ధిక మంత్రి ఎవ్వరు? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మేనల్లుడు టి హరీష్ రావు ఆర్ధిక మంత్రి అని అందరికి తెలుసు. అయితే వాస్తవానికి ఆర్ధిక అంశాలపై నేడు తరచుగా మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బి వినోద్ కుమార్ మాత్రమే. దానితో ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా అలజడి ప్రారంభమైనప్పటి నుండి గత మూడేళ్ళుగా హరీష్ రావు ఆర్ధిక వ్యవహారాలపై ఒక సమీక జరిపినట్లు గాని, […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 11:40 am
Follow us on


తెలంగాణ ఆర్ధిక మంత్రి ఎవ్వరు? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మేనల్లుడు టి హరీష్ రావు ఆర్ధిక మంత్రి అని అందరికి తెలుసు. అయితే వాస్తవానికి ఆర్ధిక అంశాలపై నేడు తరచుగా మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బి వినోద్ కుమార్ మాత్రమే. దానితో ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా అలజడి ప్రారంభమైనప్పటి నుండి గత మూడేళ్ళుగా హరీష్ రావు ఆర్ధిక వ్యవహారాలపై ఒక సమీక జరిపినట్లు గాని, మీడియా ముందుకు వచ్చిన్నట్లు గాని ఎక్కడా లేదు. ఆయన ఎక్కువగా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. మంత్రివర్గ సమావేశాలు లేదా మరేవైనా ముఖ్యమైన సమావేశాలు జరిగితేనే హైదరాబాద్ లో కనిపిస్తున్నారు.

కేంద్రం ప్రకటియించిన ఆర్ధిక ప్యాకేజీపై వరుసగా వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ హరీష్ రావు ఎక్కడ మాట్లాడినట్లు లేదు. కనీసం లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ప్రస్తావిస్తే సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు లేదా వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను జాతీయ రాజకీయాలకు వెడితే ముఖ్యమంత్రి పదవి కుమారుడు కేటీఆర్ కు అప్పచెప్పడం కోసం, మరో అధికార కేంద్రం లేకుండా చేయాలనీ హరీష్ రావు ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

అయితే కేటీఆర్ ఆశించిన విధంగా పార్టీలో, ప్రభుత్వంలో తగు పట్టు సంపాదించుకోలేక పోవడం, పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్నట్లు గ్రహించి తర్వాత హరీష్ రావు ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

హరీష్ రావు కు కీలకమైన ఆర్ధిక మంత్రి పదవి ఇచ్చినా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా క్రియాశీలంగా వ్యవహరించినట్లు ఇప్పుడు కనబడటం లేదు. కేవలం అలంకారం కోసమే మంత్రి పదవీ ఇచ్చారు గాని, అధికారాలు ఏమీ ఇవ్వలేదని అభిప్రాయం కలుగుతున్నది. దానితో హరీష్ రావు సహితం ఎక్కువగా రాజధానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఆర్ధిక అంశాల గురించి మాట్లాడవద్దని హరీష్ రావు ను కట్టడి చేస్తున్నారా? ఆ శాఖ ఉన్నతాధికారులు అందరు నేరుగా సీఎం కేసీఆర్ ను కలుస్తూ హరీష్ రావు ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రతికూల పరిస్థితులను గమనించి వ్యూహాత్మకంగా హరీష్ రావు వెనుకడుగు వేస్తున్నారా? వంటి పలు సందేహాలు ఇప్పుడు టి ఆర్ ఎస్ వర్గాలకే కలుగుతున్నాయి.

హరీష్ రావు కు సన్నిహితుడిగా పేరున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేంద్రర్ సహితం కరోనా మహమ్మారి కట్టడిలో తొలుత చాలా క్రియాశీలకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ గత నెలరోజులుగా ఆయన ప్రాధాన్యత కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నది. పరోక్షంగా ఆయన వ్యవహారాలలో సహితం కేటీఆర్ జోక్యం చేసుకొంటున్నారని తెలుస్తున్నది.

ఏది ఏమైనా టి ఆర్ ఎస్ లో రాజకీయ వ్యవహారాలు అంత సవ్యంగా లేవని భావించవలసి వస్తున్నది. మొత్తం పార్టీ, ప్రభుత్వంపై ఆధిపత్యం వహించేందుకు ఒక వంక కేటీఆర్ కు అవకాశం కల్పిస్తున్నారు. అయితే కేటీఆర్ వ్యవహార శైలి పట్ల పార్టీలో, ప్రభుత్వంలో నెలకొంటున్న అసంతృప్తిని సహితం కేసీఆర్ తేలికగా తీసుకోలేక పోతున్నారు.