Telugu News » India » Central health department has issued guidelines travelers
ప్రయాణికుల కోసం కొత్త మార్గదర్శకాలు!
లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినా వారు బస్సులు, రైళ్ళు, విమానాలల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్, ఐసోలేషన్ కి సంబంధించిన నిబంధనల్ని ఆయా రాష్ర్టాలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నది. ప్రయాణికుల మార్గదర్శకాలు ఇవే.. నిర్ణీత దూరం, మాస్కు ధరించడం, ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి చేసింది. ప్రయాణ ప్రాంగణాల్లో ప్రకటించే సూచనలను ప్రయాణికులు తప్పకుండా పాటించాలి. ప్రయాణానికి ముందు, తర్వాత థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి. […]
లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినా వారు బస్సులు, రైళ్ళు, విమానాలల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్, ఐసోలేషన్ కి సంబంధించిన నిబంధనల్ని ఆయా రాష్ర్టాలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నది.
ప్రయాణికుల మార్గదర్శకాలు ఇవే..
నిర్ణీత దూరం, మాస్కు ధరించడం, ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి చేసింది.
ప్రయాణ ప్రాంగణాల్లో ప్రకటించే సూచనలను ప్రయాణికులు తప్పకుండా పాటించాలి.
ప్రయాణానికి ముందు, తర్వాత థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి. లక్షణాలు లేనివారికే అనుమతి.
ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఐసోలేషన్ సౌకర్యం ఉన్న దవాఖానకు తరలించాలి.
తీవ్ర కరోనా లక్షణాలు ఉంటే కొవిడ్-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.
ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే.. వారిని వారంపాటు అక్కడే ఉంచి ఇంటికి పంపాలి. వారు ఆ తర్వాత మరోవారంపాటు హోం క్వారంటైన్ లో ఉండేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్ లను తరచూ శానిటైజ్ చేయాలి. ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ లో, మరో వారంపాటు హోం క్వారంటైన్ లో ఉండాలి.
తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 ఏండ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి.