ఎట్టకేలకు ఏపీకి పయనమైన బాబు..!

టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి బయలుదేరారు. మార్చి 22కి ముందు హైదరాబాద్ కు వెళ్లిన ఆయన కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మే మొదటి వారంలో డీజీపీ లేఖ రాసినా, అనుమతి రాలేదు. తాజాగా రాసిన లేఖతో ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకుని ఎల్.జి బాధితులను పరమర్శించాలని, అక్కడి నుంచి అమరావతి […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 1:10 pm
Follow us on


టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి బయలుదేరారు. మార్చి 22కి ముందు హైదరాబాద్ కు వెళ్లిన ఆయన కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మే మొదటి వారంలో డీజీపీ లేఖ రాసినా, అనుమతి రాలేదు. తాజాగా రాసిన లేఖతో ప్రభుత్వం స్పందించింది.

చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకుని ఎల్.జి బాధితులను పరమర్శించాలని, అక్కడి నుంచి అమరావతి రావాలని ప్లాన్ చేసుకోగా ప్రభుత్వం ఎయిర్ పోర్టు లో విమానాల రాకపోకలు నిలిచిపోయేలా చేసింది. వైజాగ్ ఎయిర్ పార్ట్ లో సోమవారం ఎటువంటి ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి అవకాశం లేదని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో బాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నుండి రోడ్ మార్గంలో తొలుత అమరావతికి చేరుకుంటారు. ఆయన వెంట తనయుడు లోకేష్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని ఆ పార్టీ నేత అచ్చన్నాయుడు అన్నారు. అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, రాష్ట్రంలో విమాన సర్వీసులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు విశాఖ వెలితే గ్యాస్ లీకేజ్ వెనుక నిజాలు బయటపడతాయనే భయంతో పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా చివరి నిమిషంలో ఫ్లైట్స్ రద్దు చేశారని విమర్శించారు.