Homeమిర్చి మసాలావైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

  అమరావతి ప్రాంతమంతా నిరసనలతో హోరెత్తిపోతుంది. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. మరోపక్క మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ వేగంగా ముందుకు వెళ్తోంది… ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధిచిన బిల్లు ఆమోదం లభించింది… ఇక, ఇవాళ శాసన మండలి ముందుకు బిల్లు వెళ్లింది.   చూస్తుంటే … విశాఖ నుంచి ఈ నెలలోనే పాలన ప్రారంభించాలని వైసీపీ సర్కార్ ప్రణాళికగా ఉందేమో అనిపిస్తుంది . అందులో భాగంగా… జనవరి 26న రిపబ్లిక్ డేను […]

 

అమరావతి ప్రాంతమంతా నిరసనలతో హోరెత్తిపోతుంది. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. మరోపక్క మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ వేగంగా ముందుకు వెళ్తోంది… ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధిచిన బిల్లు ఆమోదం లభించింది… ఇక, ఇవాళ శాసన మండలి ముందుకు బిల్లు వెళ్లింది.

 

చూస్తుంటే … విశాఖ నుంచి ఈ నెలలోనే పాలన ప్రారంభించాలని వైసీపీ సర్కార్ ప్రణాళికగా ఉందేమో అనిపిస్తుంది . అందులో భాగంగా… జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమైందని సమాచారం . దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా వేగంగా జరిగిపోతున్నాయి

 

.

అయితే.. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వం మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది… ఈసారికి విజయవాడలోనే రిపబ్లిక్ డే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైజాగ్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించిన వైఎస్ జగన్ సర్కార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో రిపబ్లిక్ డే నిర్వహించడం వల్ల అక్కడ ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలనే యోచనలో సర్కార్ పెద్దలు ఉన్నట్టు సమాచారం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper