Yogi Adityanath creates record: యోగీ ఆదిత్యనాథ్.. ఎవ్వరి దృష్టిలో పడకుండా ఓ పెద్ద రికార్డ్ సృష్టించాడు. లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ వితవుట్ ఇన్ టరప్షన్ గా ఈ రికార్డ్ సాధించాడు. 75 ఏళ్ల యూపీ పాలనలో ఏ సీఎం కూడా 5 ఏళ్లు పైబడి ముఖ్యమంత్రులుగా ఉన్నది కేవలం నలుగురే.. ఐదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఇంత తక్కుమంది కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
యోగి ఆధిత్యనాథ్, గోవింద్ వల్లభ్ పంత్, సంపూర్ణా నంద్, అఖిలేష్ యాదవ్ లు ఐదేళ్లు పైబడి యూపీ సీఎంగా సేవలందించిన వారిలో ఉన్నారు.

యూపీకి పట్టిన జాఢ్యం ఇదే.. అంతపెద్ద రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా లేకపోవడం ఆ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇదే. వాళ్లు షార్ట్ టర్మ్ సీఎంగా రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. అభివృద్ధి, సంక్షేమంలో యూపీ ఇందుకే వెనుకబడింది.
దీర్ఘకాలికంగా లక్ష్యాలు ఏర్పాటు చేయకపోవడానికి యూపీలో ఐదేళ్లు సీఎంగా లేకపోవడమే ప్రధాన కారణం. అందుకే బీమారు రాష్ట్రంగా మారింది. ఇప్పుడు యోగి వచ్చాక పరిస్థితులు మారుతున్నాయి. గత మూడు టర్మ్ ల నుంచి యూపీ అభివృద్ధిలో ముందుకెళుతోంది.
1960 తర్వాత రెండు సార్లు సీఎంగా ఎన్నికైన నేతనే లేడు. ఎక్కువ కాలం ఏకంగా పాలించిన యూపీ సీఎం యోగి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.