Vijay Deverakonda-Sandeep Reddy Combo Again: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)…ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన బాలీవుడ్ కి వెళ్ళి ఈ మూవీని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అనిమల్ సినిమాతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా రన్బీర్ కపూర్ ని స్టార్ హీరోగా మార్చేశాడు. ఈ సినిమాతో 900 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న వాళ్ళలో సందీప్ రెడ్డి వంగ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన సినిమాలు ఆయనను నెక్స్ట్ లెవెల్లో నిలిపాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా ‘గౌతమ్ తిన్ననూరి’ దర్శకత్వంలో వస్తున్న కింగ్డమ్ సినిమా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డివంగా వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాడు.
Also Read: పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎంత వరకూ వచ్చింది..?టీజర్ కథేంటి..?
ఇక ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడిన సందీప్ తన మొదటి హీరో అయిన విజయ్ దేవరకొండ తో మరొక సినిమా చేయబోతున్నాను అంటూ హింట్ అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా చాలా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగ మేకింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మనకు చాలా బోల్డ్ సీన్స్ అయితే కనిపిస్తాయి. వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని సినిమాలను చేస్తూ ఉంటాడు.
Also Read: మోతెవారి లవ్ స్టోరీ ట్రైలర్ లో ఆ ఒక్కటి మిస్ అయిందా..?
ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లో బోల్డ్ సీన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తన సినిమాను విమర్శించినప్పటికి ఎవ్వరికీ భయపడకుండా తన సినిమాను తను అనుకున్న రేంజ్ లో తీసి సక్సెస్ సాధించి ముందుకు తీసుకెళ్లడమే తన టార్గెట్గా పెట్టుకొని ముందుకు కదులుతూ ఉంటాడు…ఇక విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న నెక్స్ట్ సినిమా సైతం చాలా బోల్డ్ కంటెంట్ తో ఉండబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…