Ustaad Bhagat Singh Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక రీసెంట్గా ‘ హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా మరొక రెండు నెలల్లో అంటే స్పెప్టెంబర్ 25 వ తేదీన ఓజీ (OG) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి డైరెక్టర్ సుజీత్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా తన డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ఒక టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికి టీజర్ తో ప్రేక్షకులకు ఒక బూస్టప్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ సన్నాహాలైతే చేసుకుంటున్నాడు.
Also Read: అతడు’ సినిమాని పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..? వైరల్ వీడియో…
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో బుస్టప్ ని ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం హరీష్ శంకర్ సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న హరీష్ శంకర్ కి ఆయనను ఎలా ప్రెసెంట్ చేస్తే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనేది చాలా పర్ఫెక్ట్ గా తెలుసు…అందుకోసమే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.
Also Read: మోతెవారి లవ్ స్టోరీ ట్రైలర్ లో ఆ ఒక్కటి మిస్ అయిందా..?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపంలో ఈ సినిమా వస్తుండడం విశేషం…మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధిస్తాడా? హరీష్ శంకర్ సైతం ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. ఆయనకు కూడా ఈ సినిమా మంచి బూస్టప్ ను ఇస్తుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… సినిమా టీజర్ ని చూస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ అయితే వస్తుంది అంటూ సగటు ప్రేక్షకులు సైతం కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…