CM Revanth Reddy : ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. ప్రజలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు కూడా తెలిసి కూడా అలివి కాని హామీలిచ్చారు. మీడియాలో బోలెడు ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత ప్రకటనలు ఇస్తున్నారు రేవంత్ సర్కార్. సంవత్సరం ఒక వ్యక్తిని అంచనా వేయడానికి తక్కువ సమయం కాదు. మరి ఆయన పాలన ఎలా ఉంది. ఎన్నికల్లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు.
రేవంత్ చేసిన దాంట్లో రుణమాఫీ ఒక్కటే. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో అది చాలా తక్కువ. 18వేల కోట్లు మాత్రమే చేశాడు. రైతు బంధు బంద్ చేసి రైతు భరోసాను ఎత్తేశాడు. డబ్బులు లేక అమలు చేయడం లేదు.
ప్రధానంగా 6 గ్యారెంటీలు చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఉచిత విద్యుత్, గ్యాస్, ఉచిత బస్సు పథకాలే చెబుతున్నాడు. సామాన్య జనానికి ఈ మూడు పథకాల వల్ల పెద్దగా ఉపయోగం లేదని.. వారికి అర్థమైంది. కాంగ్రెస్ ఇచ్చేది కన్నా పెట్రోల్ పై వేస్తున్న ధరల మోత ఎక్కువగా ఉంది.
పెట్రోల్ , డీజిల్ పెరగడంతో నిత్యావసరాలు కొండెక్కాయి. అధిక ధరలు మోత ఎక్కిపోతున్నాయి. దీనిపై రేవంత్ రెడ్ది చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్రం తగ్గించినా రేవంత్ అస్సలు తగ్గించిన పాపాలు లేవు.
ఆర్భాటం ఎక్కువ పని తక్కువగా రేవంత్ రెడ్డి పాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.