Ali Hasan: పై ఉపమానాలు కూడా సరిపోవు.. ఎందుకంటే అతని బ్యాటింగ్ అలా ఉంది కాబట్టి.. విరోచితమైన ఇన్నింగ్స్ అంటాం కదా.. అతడు ఆడిన ఇన్నింగ్స్ అంతకంటే గొప్పది. బంతి పడటమే ఆలస్యం బౌండరీ లక్ష్యంగా ఆడాడు. బౌండరీ లైన్ చిన్నబోయేలాగా ఆడాడు. బౌలర్ చిన్నబుచ్చుకునేలా ఆడాడు. బంతిని కొట్టుడు కొడితే ఎక్కడో గాల్లో లేచింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 8సార్లు గాలిలో గింగిరాలు కొట్టింది. స్పెయిన్ వేదికగా టీ 10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో యునైటెడ్ సీసీ గిరోనా, పాక్ బార్సిలోనా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా పాక్ బార్సిలోనా బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఆటగాడు ఆలీ హసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టాడు. ముఖ్యంగా ఏడవ ఓవర్లో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్ లు కొట్టాడు. ఇక ఎనిమిదో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. అతడు బ్యాటింగ్ జోరుకు బార్సిలోనా స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. మైదానంలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన బ్యాటింగ్ చూస్తూ కేరింతలు కొట్టారు. ప్రత్యర్థి సి సి టీం బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. హసన్ మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్స్ లు ఉండగా, ఒకే ఒక్క బౌండరీ ఉంది. దీంతో ఆ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. ఓవర్ కు 19.4 పరుగుల చొప్పున ఆ జట్టు స్కోర్ చేసింది. టీ -10 చరిత్రలో ఏజట్టుకైనా ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
9.4 ఓవర్లలో 95 పరుగులకే..
బార్సిలోనా విధించిన 195 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడానికి సీసీ జట్టు రంగంలోకి దిగింది. అయితే ఏ దశలోనూ ఆ టార్గెట్ చేజ్ చేసేటట్టు కనిపించలేదు. ఆటగాళ్లు ధాటిగా ఆడే క్రమంలో వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఫలితంగా 9.4 ఓవరలో 95 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. దీంతో పాక్ బార్సిలోనా జట్టు ఏకంగా 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇది కౌంటి మ్యాచ్ కావడంతో రికార్డుల్లోకి ఎక్కలేదు.. అయితే 8 బంతుల్లో 8 సిక్స్ లు కొట్టిన హసన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇతడికి కనక పాకిస్తాన్ జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..” పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇలాంటప్పుడు ఈ తరహా ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. జట్టు ఒక్కసారిగా గాడిలో పడుతుంది. ఇలాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఉందని” పాక్ క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
8 బాల్స్ కు 8 సిక్స్ లు
స్పెయిన్ టీ10 లో అరుదైన రికార్డు… యునైటెడ్ సిసి గిరోనాతో జరిగిన మ్యాచ్లో పార్క్ బార్సిలోన ప్లేయర్ అలీహసన్ 8 బాల్స్ లో 8 సిక్స్ లు కొట్టాడు. 7 ఓవర్ చివరి రైతు బంతుల్లో ఐదు సిక్స్ లు, ఎనిమిదవ ఓవర్ లో రెండవ బంతి నుంచి వరుసగా అలీ మూడు సిక్సర్లు కొట్టాడు. pic.twitter.com/FRqIq1FkVz
— Anabothula Bhaskar (@AnabothulaB) November 21, 2024